స్విచ్ ఆఫ్ చేసినా ఎల్ఈడీ బల్బ్ వెలుగుతుందా.. ఇలా జరిగితే డేంజర్లో పడ్డట్లే..!
Ghost Glowing: స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఎల్ఈడీ బల్బ్ మసకగా వెలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. దీనికి వైరింగ్‌లో విద్యుత్ లీకేజీ కారణం కావచ్చు.
స్విచ్ ఆఫ్ చేసినా ఎల్ఈడీ బల్బ్ వెలుగుతుందా.. ఇలా జరిగితే డేంజర్లో పడ్డట్లే..!
Ghost Glowing: స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఎల్ఈడీ బల్బ్ మసకగా వెలగడం చాలామంది ఇళ్లలో కనిపించే సమస్య. చీకటి గదిలో ఈ వెలుగు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని సాంకేతికంగా ఘోస్ట్ గ్లోయింగ్ అని పిలుస్తారు. సాధారణంగా ఇంటి వైరింగ్‌లో చిన్న చిన్న లోపాలతో ఇలా జరగొచ్చు. అలాగే, వైర్లలో స్వల్ప విద్యుత్ ప్రవాహం ఏర్పడి బల్బ్ కొద్దిగా వెలిగే అవకాశం ఉంటుంది.
పాతకాలం నాటి 100 వాట్ల బల్బులకు ఇంత తక్కువ విద్యుత్ ప్రవాహం ప్రభావం చూపేది కాదు. ఎల్ఈడీ బల్బులు మాత్రం చాలా సున్నితంగా ఉండటంతో స్వల్ప విద్యుత్ వచ్చినా మసక వెలుగు కనిపించవచ్చు.
మరో ముఖ్యమైన కారణం స్విచ్‌లో పొరపాటు. విద్యుత్ ప్రసార తీగకు బదులుగా రిటర్న్ స్విచ్ అమర్చితే, స్విచ్ ఆఫ్ చేసినా బల్బ్ అమరిక వద్ద విద్యుత్ ప్రసారం కొనసాగవచ్చు. దీంతో బల్బ్ మసకగా వెలగడం జరుగుతుంది.
ఈ సమస్య వల్ల విద్యుత్ వినియోగం కొంత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, విద్యుత్ ప్రవాహం చాలా తక్కువగా ఉండటంతో సాధారణంగా విద్యుత్ బిల్లుపై పెద్దగా ప్రభావం ఉండదు.
అయితే సమస్యను నిర్లక్ష్యం చేయడం మాత్రం సరికాదు. ముఖ్యంగా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బల్బ్ వద్ద విద్యుత్ ప్రసారం ఉండొచ్చు. తాకినప్పుడు విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే నిపుణుడైన విద్యుత్ కార్మికుడితో వైరింగ్‌ను తనిఖీ చేయించి, స్విచ్‌ను సరైన విద్యుత్ వైర్లలను ఫిక్స్ చేసి ఈ సమస్యను అధిగమించవచ్చు.




