Xiaomi 18 Pro Max: ఈ ఫోన్ చూస్తే ఐఫోన్ కూడా సైడ్ ఇవాల్సిందే భయ్యా.. ఫీచర్లు నెక్స్ట్ లెవెల్ అంతే
Xiaomi 18 Pro Max: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి చైనా మార్కెట్లో తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది.
Xiaomi 18 Pro Max
Xiaomi 18 Pro Max: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి చైనా మార్కెట్లో తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో భాగంగా Xiaomi 18 Pro, Xiaomi 18 Pro Max మోడళ్లను కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియం డిజైన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తున్న ఈ కొత్త స్మార్ట్ఫోన్లు త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా సేల్కు అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ ఫోన్లు బ్లాక్, ఐస్ పీచ్ పింక్, స్టారీ స్కై బ్లూ, వైట్ వంటి ఆకర్షణీయమైన నాలుగు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి లభిస్తాయి.
డ్యూయల్ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్
ఈ కొత్త స్మార్ట్ఫోన్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి వెనుక వైపు సెకండరీ డిస్ప్లేతో వస్తాయి. Xiaomi 18 Proలో 6.4 అంగుళాల డిస్ప్లే ఉండగా, ప్రో మాక్స్ వెర్షన్లో మరింత పెద్దదైన 6.9 అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్ప్లేను అందించారు. ఇవి 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తాయి. ఇక పర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఇందులో అత్యాధునిక 2nm ప్రాసెసర్‌పై తయారైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది HyperOS 4 ఆధారిత ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
200MP కెమెరా, భారీ బ్యాటరీ బ్యాకప్
ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వారిని ఆకట్టుకునేలా ఈ ఫోన్లలో పవర్ ఫుల్ కెమెరా సెటప్ ఇన్స్టాల్ చేశారు. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సిస్టమ్ ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరాను పొందుపరిచారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే రోజంతా నాన్‌స్టాప్ యూసేజ్ కోసం ఇందులో భారీ 8500mAh బ్యాటరీని అందించడం విశేషం.
ధర, లభ్యత వివరాలు
ధరల విషయానికి వస్తే.. Xiaomi 18 Pro ప్రారంభ ధర సుమారు రూ.86,000 నుంచి ప్రారంభమవుతుండగా హైఎండ్ మోడల్ ధర సుమారు రూ.1,43,000 వరకు ఉంది. అలాగే పవర్ఫుల్ ఫీచర్లతో కూడిన Xiaomi 18 Pro Max బేస్ వేరియంట్ ధర సుమారు రూ.1,00,000 ఉండగా, టాప్ మోడల్ ధర సుమారు రూ.1,57,000 వరకు ఉంటుంది. చైనాలో ఈ ఫోన్ల విక్రయాలు త్వరలోనే ప్రారంభం కానుండగా గ్లోబల్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.




