Xiaomi 18 Pro Max : మార్కెట్‌ను షేక్ చేయబోతున్న 'షావోమి 18 ప్రో మాక్స్'.!
Xiaomi 18 Pro Max : స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే షావోమి (Xiaomi) సంస్థ, త్వరలోనే తన మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్
Xiaomi-18-Pro-Max
Xiaomi 18 Pro Max : స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే షావోమి (Xiaomi) సంస్థ, త్వరలోనే తన మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ 'షావోమి 18'ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లోని టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'షావోమి 18 ప్రో మాక్స్' (Xiaomi 18 Pro Max) కి సంబంధించిన లీకులు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ ఊహకందని డిస్‌ప్లే, అదిరిపోయే కెమెరాలు, , ఏకంగా ఒక పవర్‌బ్యాంక్ స్థాయి బ్యాటరీ సామర్థ్యంతో రాబోతోంది.
అల్ట్రా ప్రీమియం డిస్‌ప్లే
లీకైన ఇంజనీరింగ్ ప్రోటోటైప్ వివరాల ప్రకారం, షావోమి 18 ప్రో మాక్స్ సరికొత్త కస్టమ్ ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. ఫోన్ నాలుగు వైపులా అత్యంత సన్నని బెజెల్స్ (Slim Bezels) , పెద్ద రౌండెడ్ కార్నర్స్ ఉండటంతో లుక్ పరంగా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో 6.9-ఇంచుల భారీ 2K OLED ప్యానెల్‌ను అమర్చే అవకాశం ఉందని మునుపటి నివేదికలు సూచిస్తున్నాయి, ఇది వినియోగదారులకు అద్భుతమైన స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
డ్యూయల్ 200MP కెమెరా మ్యాజిక్
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని కెమెరా సెటప్ అని చెప్పవచ్చు. ఇందులో సరికొత్త LOFIC టెక్నాలజీతో కూడిన 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇవ్వబోతున్నారు, ఇది తక్కువ వెలుతురు ఉన్న సమయంలో కూడా అత్యంత స్పష్టమైన డైనమిక్ రేంజ్ ఫోటోలను అందిస్తుంది. దీనికి తోడుగా, 3x ఆప్టికల్ జూమ్ , మాక్రో ఫోటోగ్రఫీ సపోర్ట్ చేసే మరో 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను కూడా జత చేయనున్నారు. ఎప్పటిలాగే ప్రసిద్ధ కెమెరా బ్రాండ్ 'లైకా' (Leica) భాగస్వామ్యంతో ఈ కెమెరాలను ట్యూన్ చేయనుండటం విశేషం.
8,500mAh మెగా బ్యాటరీ
స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే నిలిచిపోయేలా ఇందులో ఏకంగా 8,500mAh సామర్థ్యం గల "8K++" బ్యాటరీని అమరుస్తున్నట్లు టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఇంత పెద్ద బ్యాటరీని కేవలం కొద్ది నిమిషాల్లోనే ఛార్జ్ చేయడానికి వీలుగా 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ , 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు, దీనివల్ల బ్యాటరీ లైఫ్ , ఛార్జింగ్ స్పీడ్ విషయంలో యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ధర , లాంచ్ ఎప్పుడు.?
ఈ అల్ట్రా-ప్రీమియం హార్డ్‌వేర్ ఫీచర్ల కారణంగా ఈ ఫోన్ ధర మార్కెట్లో చాలా ఖరీదుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో (Q4) షావోమి 18, షావోమి 18 ప్రో మోడల్స్‌తో పాటు ఈ 'ప్రో మాక్స్' వేరియంట్‌ను కూడా అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




