రూ. 14 వేల డిస్కౌంట్‌తో జియోమీ 43 ఇంచుల 4K టీవీ.. దీపావళీకి అదిరిపోయే డీల్..!

Xiaomi 43 inch TV: దీపావళి షాపింగ్‌కు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో Xiaomi 43 ఇంచుల 4K Smart TVపై ఏకంగా రూ. 14,000 వరకు తగ్గింపు కనిపిస్తోంది.

Venkat
Published on: 27 Oct 2026 7:40 PM IST
Xiaomi 43 inch TV
X

రూ. 14 వేల డిస్కౌంట్‌తో జియోమీ 43 ఇంచుల 4K టీవీ.. దీపావళీకి అదిరిపోయే డీల్..!

Xiaomi 43 inch TV: దీపావళి పండుగ సందర్భంగా కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్‌లో ఆసక్తికరమైన టీవీ డీల్ కనిపిస్తోంది. జియోమీ F సిరీస్ 43 ఇంచుల 4K స్మార్ట్ ఫైర్ TVపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ టీవీ రూ. 37,999 కాగా, ప్రస్తుతం ₹23,999 ధరకు లిస్టయింది. అంటే లిస్టెడ్ ఎంఆర్పీతో పోలిస్తే సుమారు రూ. 14,000 ఆదా అవుతుంది.

జియోమీ 43 ఇంచుల టీవీ ధర ఎంత?

జియోమీ F సిరీస్ 43 ఇంచుల అల్ట్రా హెచ్డీ 4K ఎల్ఈడీ స్మార్ట్ ఫైర్ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 23,999కు కనిపిస్తోంది. దీని రూ. 37,999. అంటే 36-37 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అదనంగా అందుబాటులో ఉన్న బ్యాంక్ లేదా కార్డ్ ఆఫర్లను వర్తింపజేస్తే తుది ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే కార్డ్ ఆఫర్, స్టాక్, ధరలు మారే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో వివరాలను చెక్ చేయడం మంచిది.

43 ఇంచుల 4K డిస్‌ప్లే..

ఈ జియోమీ టీవీలో 43 ఇంచుల అంటే 108 సెంటీమీటర్ల డిస్‌ప్లే ఉంటుంది. అల్ట్రా హెచ్ డీ 4K రిజల్యూషన్‌తో 3840×2160 పిక్సెల్స్ అందిస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ వంటి కంటెంట్ చూడటానికి ఈ స్క్రీన్ సరిపోతుంది.

ఫైర్ టీవీ ఓఎస్.. 32GB స్టోరేజ్

ఈ మోడల్‌లో ఫైర్ టీవీ ఓఎస్ 8 అందుబాటులో ఉంది. క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్, 2GB ర్యామ్ తో పాటు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీంతో యాప్స్, స్ట్రీమింగ్ కంటెంట్ వంటి వాటిని టీవీలో ఉపయోగించుకోవచ్చు. అలెక్సా సపోర్ట్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు కూడా ఈ మోడల్‌లో ఉన్నాయి.

కనెక్టివిటీ ఎలా ఉంది?

కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు ఉన్నాయి. డ్యూయల్-బ్యాండ్ Wi-Fi సపోర్ట్ కూడా లభిస్తుంది. గేమింగ్ కన్సోల్, సెట్-టాప్ బాక్స్, సౌండ్‌బార్ వంటి ఇతర డివైస్‌లను కనెక్ట్ చేసుకోవడానికి HDMI పోర్టులు ఉపయోగపడతాయి.

ఆడియో విషయానికి వస్తే 24W స్పీకర్ అవుట్‌పుట్‌తో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఫిల్మ్‌మేకర్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.

కొనాలనుకునేవారు ఇది గమనించాలి

ధర పరంగా చూస్తే రూ. 23,999కు 43 ఇంచుల 4K ఫైర్ టీవీ లభించడం ఆసక్తికరమైన డీల్. అయితే ధర చరిత్రను పరిశీలిస్తే ఈ మోడల్ అక్టోబర్ 17న రూ. 20,999 వరకు కూడా కనిపించింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న రూ. 23,999 ధరను తప్పనిసరిగా అత్యంత తక్కువ ధరగా భావించాల్సిన అవసరం లేదు.

దీపావళి సమయంలో కొత్త 43 ఇంచుల 4K టీవీ కొనాలని చూస్తున్నవారు ఈ జియోమీ ఎఫ్ సిరీస్ మోడల్‌ను పరిశీలించవచ్చు. అయితే ఆర్డర్ చేసే ముందు ప్రస్తుత ధర, బ్యాంక్ ఆఫర్, వారంటీ, డెలివరీ ఛార్జీలు, అందుబాటులో ఉన్న స్టాక్ వంటి వివరాలను ఫ్లిప్‌కార్ట్‌లో ఒకసారి చెక్ చేయడం మంచిది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.