Magnetic Power Bank : షియోమీ పవర్ బ్యాంక్స్‌లో బిగ్ బ్లాస్ట్.. 45W ఛార్జింగ్‌తో ఎంట్రీ..!

Magnetic Power Bank : ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) ఇండియన్ మార్కెట్‌లో తమ ఛార్జింగ్ యాక్సెసరీస్ లైనప్‌ను మరింత విస్తరించడానికి రెడీ అయింది..

G Krishna
Published on: 1 Sept 2026 4:22 PM IST
xiaomi magnetic power banks
X

xiaomi magnetic power banks 

Magnetic Power Bank : ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) ఇండియన్ మార్కెట్‌లో తమ ఛార్జింగ్ యాక్సెసరీస్ లైనప్‌ను మరింత విస్తరించడానికి రెడీ అయింది. దీనిలో భాగంగా రెండు కొత్త మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్స్‌ను భారతీయ వినియోగదారుల ముందుకు తీసుకెళ్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) ద్వారా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ లైనప్‌లో 'షియోమీ ఆల్ట్రాథిన్ మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్ 5000 15W' తో పాటు 'షియోమీ మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్ 10000 45W' మోడళ్లు సెప్టెంబర్ 8న ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ కానున్నాయి. అయితే ఈ ప్రాడక్ట్స్ ధరలు , సేల్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఆల్ట్రాథిన్ డిజైన్ – కత్తిలాంటి లుక్ అండ్ ఐఫోన్ సపోర్ట్

ఇప్పటికే కొన్ని గ్లోబల్ మార్కెట్లలో రిలీజ్ అయిన షియోమీ ఆల్ట్రాథిన్ మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్ 5000 15W డిజైన్ ప్రైమరీ హైలైట్‌గా నిలవనుంది. కేవలం 6 మిమీ మందం , 98 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ పవర్ బ్యాంక్ చూడటానికి చాలా స్లిమ్‌గా, పేపర్ వెయిట్‌లా ఉంటుంది. ఇందులో 5,000mAh హై-ఎనర్జీ-డెన్సిటీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. ఇది 15W మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఐఫోన్ యూజర్ల కోసం 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్ అందుబాటులో ఉంటుంది. టైప్-సి పోర్ట్ ద్వారా 22.5W వైర్డ్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకేసారి వైర్డ్ అండ్ వైర్‌లెస్ విధానాల్లో రెండు డివైజులను ఛార్జ్ చేసే వెసులుబాటు ఉండటం విశేషం.

కూలింగ్ సిస్టమ్ అండ్ మల్టీ-డివైజ్ కాంపాటిబిలిటీ

ఛార్జింగ్ టైమ్‌లో డివైజ్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండేందుకు షియోమీ ఇందులో 4,369 స్క్వేర్ మిమీ గ్రాఫైట్ హీట్ డిస్సిపేషన్ షీట్‌తో పాటు డ్యూయల్ NTC టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రొవైడ్ చేసింది. దీనితో పాటు ఓవర్‌వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్, ఓవర్ ఛార్జింగ్ వంటి సమస్యల నుంచి డివైజ్‌లను కాపాడేందుకు మల్టిపుల్ ప్రొటెక్షన్ లేయర్స్ ఉన్నాయి. ఈ ఆల్ట్రాథిన్ పవర్ బ్యాంక్ షియోమీ 12 సిరీస్ నుంచి లేటెస్ట్ మోడళ్లు, ఐఫోన్ 12 సిరీస్ అండ్ తదుపరి మోడళ్లు, శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా నుంచి S26 అల్ట్రా వరకు, అలాగే గూగుల్ పిక్సెల్ 9 , పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లకు పర్ఫెక్ట్‌గా సపోర్ట్ చేస్తుంది.

10,000mAh కెపాసిటీతో మరో పవర్ హౌస్

ఈ ఆల్ట్రాథిన్ మోడల్‌తో పాటే షియోమీ మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్ 10000 45W కూడా ఇండియన్ మార్కెట్‌లో అడుగుపెట్టబోతోంది. ఇది 10,000mAh భారీ బ్యాటరీ కెపాసిటీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ ట్రావెల్ చేసే వారికి, హెవీ యూజర్లకు ఇది చాలా యూజ్‌ఫుల్ యాక్సెసరీగా మారనుంది. గ్లోబల్ మార్కెట్‌లో గ్రాఫైట్ బ్లాక్, గ్లేసియర్ సిల్వర్ , రేడియంట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్న ఈ పవర్ బ్యాంక్స్ ఇండియాలో ఏ రేంజ్ ధరల్లో అందుబాటులోకి వస్తాయో తెలియాలంటే సెప్టెంబర్ 8 వరకు వెయిట్ చేయాల్సిందే.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story