Xiaomi: షావోమీ నుంచి 'ఎస్ మినీ ఎల్‌ఈడీ' సిరీస్‌.. సౌండ్, పిక్చర్ క్వాలిటీ చూస్తే పరేషానే..!

Xiaomi TV S Mini LED 2026: షావోమీ నుంచి కళ్లు చెదిరే టీవీలు మార్కెట్ లోకి వచ్చాయి. ముఖ్యంగా సౌండ్, పిక్చర్ క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ సిరీస్ ను విడుదల చేసింది.

Venkat
Published on: 16 April 2026 12:20 PM IST
Xiaomi
X

Xiaomi: షావోమీ నుంచి 'ఎస్ మినీ ఎల్‌ఈడీ' సిరీస్‌.. సౌండ్, పిక్చర్ క్వాలిటీ చూస్తే పరేషానే..!

Xiaomi TV S Mini LED 2026: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ భారత వినియోగదారుల కోసం 2026 సిరీస్ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. అత్యాధునిక 'మినీ ఎల్‌ఈడీ' సాంకేతికతతో వచ్చిన ఈ టీవీలు పిక్చర్ క్వాలిటీతో కొత్త అనుభూతిని ఇస్తాయి. 4కే రిజల్యూషన్, శక్తివంతమైన స్పీకర్లు, ఆకర్షణీయమైన ధరలతో లభిస్తున్న ఈ టీవీల పూర్తి విశేషాలు ఓసారి చూద్దాం.

మూడు వేరియంట్లలో లభ్యం..

షావోమీ తన 'ఎస్ మినీ ఎల్‌ఈడీ' సిరీస్‌ను మూడు వేర్వేరు పరిమాణాలలో ప్రవేశపెట్టింది. ఇవి 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల డిస్ప్లే సైజులలో అందుబాటులో ఉన్నాయి. కంటికి ఇంపుగా అనిపించే క్యూడీ-మినీ ఎల్‌ఈడీ ప్యానెల్స్ ఈ టీవీల ప్రత్యేకత. ఇవి 4కే నాణ్యతతో కూడిన స్పష్టమైన చిత్రాలను అందిస్తాయి. షావోమీ సొంతంగా అభివృద్ధి చేసిన ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌తో ఇవి పని చేస్తాయి.

ధర, ఆఫర్ల వివరాలు..

భారతదేశంలో ఈ సరికొత్త సిరీస్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

55 అంగుళాల మోడల్: రూ. 51,999

65 అంగుళాల మోడల్: రూ. 71,999

75 అంగుళాల మోడల్: రూ. 99,999

ప్రస్తుతం ఈ టీవీల ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 22 నుంచి షావోమీ అధికారిక వెబ్‌సైట్, ఇతర ఈ-కామర్స్ పోర్టల్స్, రిటైల్ స్టోర్లలో ఇవి విక్రయానికి రానున్నాయి. ముందస్తు బుకింగ్ చేసుకునే వారికి రూ. 10,000 వరకు బ్యాంకు డిస్కౌంట్లతో పాటు, అదనంగా రెండేళ్ల వారంటీ (మొత్తం నాలుగు ఏళ్లు) లభిస్తుంది. 12 నెలల వరకు వడ్డీ లేని సులభ వాయిదా పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్లు..

ఈ టీవీలు 2160x3840 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తాయి. గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండి, పగటి వెలుతురులో కూడా స్పష్టమైన దృశ్యాలను చూపిస్తాయి. ఇందులో వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 సాంకేతికతను వాడారు. గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా డీఎల్‌జీ 120 హెర్ట్జ్, ఆటో లో లేటెన్సీ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సౌండ్ క్వాలిటీ..

సౌండ్ విషయంలో షావోమీ రాజీ పడలేదు. ఇందులో 34 వాట్ల సామర్థ్యం గల నాలుగు స్పీకర్ల వ్యవస్థ ఉంది. ఇది డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం మూడు హెచ్‌డీఎమ్ఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, వై-ఫై,బ్లూటూత్ సౌకర్యాలు ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీలో 2జీబీ ర్యామ్, 32జీబీ అంతర్గత మెమరీ ఉంది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కంట్రోల్ సదుపాయం కూడా ఉంటుంది. ఇంటినే ఒక సినిమా థియేటర్‌లా మార్చాలనుకునే వారికి ఈ షావోమీ మినీ ఎల్‌ఈడీ టీవీలు ఒక అద్భుతమైన ఎంపిక.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story