Vikarabad: తాండూరులో అదృశ్యమైన బాలుడు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు!
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో 12 ఏళ్ల బాలుడు అమీన్ అదృశ్యం. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు.
Vikarabad: తాండూరులో అదృశ్యమైన బాలుడు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు!
వికారాబాద్ జిల్లా: తాండూరు పట్టణ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో 12 ఏళ్లు బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. నిన్న మధ్యానం 3 గంటల సమయంలో బయటకు వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగిరాకపోవడంతో అతడి తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. కనిపించకుండా పోయిన బాలుడు అమీన్ (12) కుటుంబం తాండూరు పట్టణంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటుంది.
శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయటకు వెళ్లిన అమీన్ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో అమీన్ కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలింపు చేపట్టారు. తెలిసివారిని కూడా సంప్రదించారు. అయితే లాభం లేకపోవడంతో.. చివరకు పోలీసులను ఆశ్రయించారు. అమీన్ తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అమీన్ మిస్సింగ్ కావడంతో అతడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.




