Cheeriyal: చీర్యాల స్వామివారి కళ్యాణోత్సవం.. పూర్తి వివరాలు
Cheeriyal: చీర్యాల లక్ష్మీనరసింహస్వామి వారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 15 వరకు జరగనున్నాయి.
Cheeriyal: చీర్యాల స్వామివారి కళ్యాణోత్సవం.. పూర్తి వివరాలు
Cheeriyal: ప్రతి ఏటా శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామి వారి అష్టాదశ (18వ) వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 ఏప్రిల్ 12 నుండి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు ఆలయ ఫౌండర్ & చైర్మన్ మల్లారపు లక్ష్మీ నారాయణ ఇంటి దగ్గర నుండి చీర్యాల గ్రామం లో ఊరేగింపు గా తిరిగి స్వామి దేవాలయానికి చేరుకుంటారు.
సోమవారం రోజున స్వామివారికి పంచామృత నవ కళాశాభిషేకం ,విశ్వక్సేన పూజ ,పుణ్యావచనం ,రక్షాబంధనం ,అఖండ జ్యోతి స్థాపన ,అంకురార్పణ ,అగ్ని ప్రతిష్ట, సుదర్శన నరసింహయాగం వివిధ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీ యాదగిరిగుట్ట రిటైర్డ్ ప్రధానార్చకులు నల్లందిగులు నృసింహ చార్యులు గారి ఆధ్వర్యంలో ఆలయ ఫౌండర్ & చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం.
వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఘనంగా నిర్వహించారు బుధవారం రోజున మహాపూర్ణాహుతి, శతఘఠాభిషేకం, అలంకరణ పంచహారతులు చక్రస్నానం తో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో మూడు రోజులు శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు పూటలు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి .
ప్రతి సంవత్సరం కూడా స్వామి వారి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు .ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ సమయం లో వేసవి సెలవులు కూడా ఉండడంతో భక్తులు భారీ ఎత్తున వచ్చే అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు
ఆర్టీసీ బస్సు సౌకర్యం:
బస్సు నెంబరు 241 C చీర్యాల టెంపుల్ నుండి సికింద్రాబాద్ స్టేషన్ వరకు మొత్తం ఆరు ట్రిప్పులు ఉదయం 7:10 నిమిషాలకి, 9:40 నిమిషాలకి ,మధ్యాహ్నం 12 గంటలకి , 2:30 గంటలకు, సాయంత్రం 5 గంటలకి ,రాత్రి 7:20 నిమిషాలకి.సికింద్రాబాద్ స్టేషన్ నుండి చీర్యాల టెంపుల్ వరకు ఉదయం 8:30 గంటలకి ,10:50 నిమిషాలకి, మధ్యాహ్నం 1:10 నిమిషాలకి సాయంత్రం 3:40 నిమిషాలకి మరియు 6:10 నిమిషాలకి.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సౌకర్యం ,చలువ పందిర్లు, కేర్ హాస్పిటల్ వారిచే మెడికల్ క్యాంపు, ఈసీఐఎల్ సోలిస్ హాస్పిటల్ వారిచే ఉచిత మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్నట్టుగా ఆలయ ఫౌండర్ & చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ తెలిపారు.




