Hyderabad: తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోయిస్టుల లొంగుబాటు!
Hyderabad: తెలంగాణ పోలీసుల ముందు మరోసారి భారీగా మావోయిస్టుల లొంగుబాటు. హైదరాబాద్‌లో 47 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు.
Hyderabad: తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోయిస్టుల లొంగుబాటు!
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు.
మొత్తం 47 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపారు. ఈ సందర్భంగా వారు తమ వద్ద ఉన్న 34 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారందరినీ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈ సభ్యులంతా పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.
తెలంగాణలో గత కొద్ది నెలలుగా అగ్రనేతలతో సహా దళ సభ్యులు వరుసగా పోలీసులకు లొంగిపోతున్నారు. గతేడాది డిసెంబర్‌లో 41 మంది లొంగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అగ్రనేతలు దేవ్ జీ, సంగ్రామ్, దామోదర్, గంగన్న వంటి వారు ఆయుధాలు వీడారు. ఈ నెల రెండో వారంలోనూ 30 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ కగార్’ సత్ఫలితాలను ఇస్తోంది. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాల నిరంతర కూంబింగ్, వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల క్యాడర్ కుదేలైంది. వందలాది మంది మరణించడం, వేలాది మంది అరెస్ట్ కావడంతో.. అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి సభ్యుల వరకు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిణామంతో దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం దాదాపుగా తగ్గిపోయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.




