Kamareddy: జగజ్యోతి బసవేశ్వరునికి ఘన నివాళి
Kamareddy: జుక్కల్ నియోజకవర్గంలో మహాత్మ బసవేశ్వరుని 895వ జయంతి వేడుకలు.
Kamareddy: జగజ్యోతి బసవేశ్వరునికి ఘన నివాళి
జుక్కల్ (కామారెడ్డి): విశ్వ గురు మహాత్మ బసవేశ్వరుడు అందరి వాడని లింగ వివక్ష మూడ నమ్మకాలు, సామాజిక వివక్ష జంతు బలికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏకైక వ్యక్తి మహాత్మ బసవేశ్వరుడు అని అన్నరు. మహాత్మా బసవేశ్వర 895 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని బిచ్కుంద, జుక్కల్, మద్నూర్ మండలాల్లో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు.బిచ్కుంద మండలం సెట్లూరు, మద్నూర్ మండలం లక్చన్ గ్రామాల్లో వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర విగ్రహం, చిత్ర పటలకు పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు.మహాత్మా బసవేశ్వరుడు క్రీస్తు శకం 11 శతాబ్దానికి చెందిన వాడని తన జీవిత కాలంలో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల్లో వీర శైవాన్ని స్థాపించి భారతీయులలో ఏకతను ప్రతిపాదించి ప్రేమ సూత్రం తో బంధించిన జగజ్యోతి భక్త బంధం బసవేశ్వరుడన్నారు.
వీరశైవం జాతి కుల మతాలకతీతమైందని భక్తులంతా ఈశ్వర కులస్తులని అన్నారు. లింగాయత్ సంప్రదాయ వ్యవస్థాపక సాధువు అయిన మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలు కర్ణాటక, మహారాష్ట్ర లకు సరిహద్దు ప్రాంతం అయిన జుక్కల్ ప్రాంతంలో ప్రతి యేట ఘనంగ జరుపుకుంటారు. కుల వ్యవస్థ లేని అందరికి సమాన అవకాశాలు ఉండే సమాజాన్ని ఆయన విశ్వసించే వాడని అన్నారు. సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ బేధాలను లింగ వివక్ష తను సమూలంగా వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయ వాది మహాత్మా బసవేశ్వరుడని అన్నారు. ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు ఏకతను చాటాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమం లో సెట్లూరు గ్రామ పెద్దలు రాజు పటేల్, సంతోష్ ,ఎల్కే శంకర్. మాణిక్ రావు, బుజ్జప్ప పటేల్ తదితరులు పాల్గొన్నారు.




