Khammam: మణుగూర్‌లో విషాదం.. చెరువులో విద్యార్థి గల్లంతు
Khammam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదం. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో చెరువులో స్నానానికి దిగిన 9వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ గల్లంతు.
Khammam: మణుగూర్‌లో విషాదం.. చెరువులో విద్యార్థి గల్లంతు
Khammam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మణుగూరు పట్టణంలోని విజ్ఞాన్ హై స్కూల్ ప్రైవేట్ పాఠశాల కు చెందిన ముగ్గురు 9తరగతి విద్యార్థులు స్కూలు నుంచి ఇంటికి వెళ్లే సమయంలో నేరుగా పీవీ కాలనీ అటవీ ప్రాంతంలోని రేగుల గండి చెరువులో స్నానానికి వెళ్లారు. చెరువులోకి దిగిన ముగ్గురు విద్యార్థులలో నక్క హర్షవర్ధన్ (14) అనే విద్యార్థి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో విద్యార్థిని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో ఆప్రాంతంలో విషాద ఛాయలు ఆలుముకున్నాయి.
Next Story




