Karimnagar: విద్యార్థుల పక్షాన ఏబీవీపీ.. శాతవాహనలో కొత్త కోర్సుల కోసం పోరు
Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయాలని ఏబీవీపీ డిమాండ్. వీసీ ఉమేష్ కుమార్కు వినతిపత్రం అందజేసిన పూసాల విష్ణు.
Karimnagar: విద్యార్థుల పక్షాన ఏబీవీపీ.. శాతవాహనలో కొత్త కోర్సుల కోసం పోరు
కరీంనగర్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-ABVP కరీంనగర్ ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులను ప్రారంభించి, విశ్వవిద్యాలయాలన్ని బలోపేతం చేయాలి అని శాతవాహన యూనివర్సిటీఉపకులపతి(VC) ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ శాతవాహన విద్యాలయం 2009లో ఏర్పడి నుంచి కేవలం అరకొర వసతులతో, తక్కువ సంఖ్యలో కోర్సులను ప్రారంభించడం జరిగింది. అప్పటినుండి అనేక దఫాలుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొత్త కోర్సులను ఏర్పాటు చేయాలి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలి అని విద్యార్థి సంక్షేమం దృష్ట్యా పోరాటం చేస్తూనే ఉన్నది. ఈ దశలో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కళాశాల, ఏం.ఫార్మసీ, లా కళాశాల వంటి కోర్సులు తీసుకురావడం పట్ల ప్రస్తుత ఉపకులపతి కృషి అభినందించదగ్గ విషయం.
శాతవాహన విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులను ప్రారంభించాలి.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సైన్స్ విభాగంలో ఎం.ఎస్సీ - జువాలజీ, జియాలజీ, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫిషరీస్ వంటి కోర్సులను: బీఈడీ, ఎంఏ హిందీ, సంస్కృతము, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, లైబ్రరీ సైన్స్ వంటి కొత్త కోర్సులను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నత విద్యను, పరిశోధన విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారికి వినతి పత్రం అందించారు. ఈ ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యార్థి చైతన్యానికి తోడ్పాటు నందించే విధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి డిమాండ్ ఉన్న కోర్సులను రెగ్యులర్ కోర్సులు గా తీసుకురావాలని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసల విష్ణు, స్టేట్ హాస్టల్స్ కో-కన్వీనర్ నందు, శ్రీనివాస్, మహేష్ పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




