Karimnagar: విద్యాశాఖకు మంత్రి లేరా? 9,500 కోట్ల బకాయిలు ఏమయ్యాయి?

Karimnagar: స్కాలర్షిప్&ఫిజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేసి, విద్యాశాఖకు మంత్రిని నియమించాలని పూసాల విష్ణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 March 2026 7:53 PM IST
Karimnagar
X

Karimnagar: విద్యాశాఖకు మంత్రి లేరా? 9,500 కోట్ల బకాయిలు ఏమయ్యాయి?

కరీంనగర్: పెండింగ్ లో ఉన్న 9,𝟓𝟎𝟎కోట్ల స్కాలర్షిప్&ఫిజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేసి, విద్యాశాఖకు మంత్రిని నియమించాలని-ABVP కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్బంగా ABVP కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతు ఒక రాష్ట్ర అభివృద్ధి విద్యపై ఆధారపడి ఉంటుందని, విద్యను బలోపేతం చేయకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.

విద్యాశాఖకు మంత్రిని నియమించండి..

రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యాశాఖకు ఇప్పటివరకు పూర్తిస్థాయి మంత్రి నియామకం జరగకపోవడం వల్ల విద్యారంగానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. అందువల్ల వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమవుతున్నారు..

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం కావడం వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువు కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

కొన్ని సందర్భాల్లో ఫీజులు చెల్లించలేక విద్యార్థులు కళాశాలలకు హాజరు కాలేకపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని, ఆ హక్కును రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయడంతో పాటు విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో విద్యార్థి ఉద్యమాలు చేపడతామని హేచ్చరించారు.

ఈ కార్యక్రమం లో రాష్ట్ర హిస్టల్స్ కో-కన్వీనర్ నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, నగర కార్యదర్శి యోగేష్, కార్యకర్తలు శివ, రంజిత్,మనోజ్,ఆదిత్య, నవీన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story