DSP Bheem Reddy: ఏసీబీ చేతికి డీఎస్పీ భీమ్‌రెడ్డి.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

DSP Bheem Reddy: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులకు చిక్కిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

Arun Chilukuri
Published on: 7 July 2026 10:45 AM IST
DSP Bheem Reddy
X

DSP Bheem Reddy: ఏసీబీ చేతికి డీఎస్పీ భీమ్‌రెడ్డి.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

DSP Bheem Reddy: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమ్‌రెడ్డికి మెజస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ భీమ్‌రెడ్డిని ACB అధికారులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి, దాదాపు మూడు వందల కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు.

కేసు విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు.. భీమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. భీమ్‌రెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ ఆఫీస్‌కు తరలించి.. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఎదుటహాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించారు. చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు భీమ్‌రెడ్డిని ఏసీబీ.. కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story