ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇళ్లపై ఏసీబీ దాడులు!

ACB Raids: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 3 Jun 2026 11:43 AM IST
ACB Raids
X

ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇళ్లపై ఏసీబీ దాడులు!

ACB Raids: తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping Case) కేసులో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్‌ ఎస్పీ (Addl SP) భుజంగరావు నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం ఉదయం నుంచే మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు. భుజంగరావుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే గట్టి ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.

ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు భుజంగరావు సొంత జిల్లా అయిన సూర్యాపేట మరియు రెండు రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాల్లో మొత్తం 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

కేవలం భుజంగరావు నివాసంలోనే కాకుండా.. ఆయన బినామీలు, అత్యంత ఆప్తులు మరియు కీలక బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. భుజంగరావు సర్వీస్ కాలంలో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుల నేపథ్యంలో.. నివాసాల్లోని విలువైన పత్రాలు, బ్యాంక్ లాకర్లు, డిజిటల్ ల్యాప్‌టాప్‌లు, డైరీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పటికే ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో.. ఇప్పుడు ఏసీబీ అక్రమాస్తుల కోణంలో దాడులు చేయడం పోలీస్ శాఖతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. సోదాలు ముగిసిన అనంతరం పట్టుబడిన ఆస్తుల పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story