Mahbubnagar: అవినీతిపై పోరాటం.. మీసేవ అక్రమాలపై ఏసీబీ నిఘా
Mahbubnagar: మహబూబ్‌నగర్ పట్టణంలోని మీసేవ కేంద్రాలపై ఏసీబీ దాడులు. అధిక వసూళ్లు, అనధికార స్టాంపులపై డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు.
Mahbubnagar: అవినీతిపై పోరాటం.. మీసేవ అక్రమాలపై ఏసీబీ నిఘా
Mahbubnagar: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని యూటర్న్ చౌరస్తాలో గల మీసేవ సెంటర్ పై ఏసీబీ దాడులు జరిపారు. పలు మీసేవ సెంటర్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు పలు మీసేవ సెంటర్లపై దాడులు నిర్వహించారు.
ప్రజా సేవలలో పారదర్శకతను నెలకొల్పడం మరియు అవినీతిని అరికట్టడం లక్ష్యంగా ఈ రోజు అవినీతి నిరోధక శాఖ, మహబూబ్‌నగర్ రేంజ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలోని కాసి మీ సేవ కేంద్రం (యజమాని: శ్రీ అలంపల్లి విశ్వనాథ్) వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించబడింది.ఈ తనిఖీలో క్రింది అంశాలను పరిశీలించడం జరిగింది.
01 ఏప్రిల్ 2026 నుండి అమల్లో ఉన్న ప్రభుత్వ సిటిజన్స్ చార్టర్‌ను కేంద్ర యజమాని/ఆపరేటర్ పాటిస్తున్నాడా లేదా.సేవల అందజేతలో విధివిధానాలు మరియు అధికారిక నిబంధనలు అనుసరిస్తున్నారా లేదా.కేంద్రంలో అనుమానాస్పద స్టాంపులు, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు లేదా అనధికార పత్రాలు ఉన్నాయా లేదా.
అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయా లేదా.ప్రభుత్వ నిర్ణయించిన రుసుములకు మించి వసూళ్లు చేస్తున్నారా లేదా. ఏవైనా ప్రభుత్వ అధికారులు మీ సేవ కేంద్ర యజమాని/ఆపరేటర్‌తో అనధికార సంబంధాలు కలిగి ఉన్నారా లేదా. ఇతర ఎటువంటి అక్రమాలు లేదా దుర్వినియోగాలు జరుగుతున్నాయా లేదా.
ఈ ఆకస్మిక తనిఖీని ACB డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ CH. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మరియు ACB మహబూబ్‌నగర్ రేంజ్ సిబ్బంది పాల్గొని నిర్వహించారు. ప్రజలకు అందించే సేవలు న్యాయంగా, పారదర్శకంగా మరియు బాధ్యతాయుతంగా అందుతున్నాయో లేదో నిర్ధారించడం ఈ తనిఖీ ప్రధాన ఉద్దేశ్యం.
ప్రజలు ఎవరైనా అవినీతి, అధిక వసూళ్లు లేదా ఇతర అక్రమాలకు గురైనట్లయితే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరడమైనది. ఫిర్యాదులను టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా లేదా అవినీతి నిరోధక శాఖ, తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.




