DSP Bhim Reddy: డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
DSP Bhim Reddy: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన డీఎస్పీ భీంరెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు బయటపడ్డాయి.
DSP Bhim Reddy: డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
DSP Bhim Reddy: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీంరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. భీంరెడ్డి ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఏకకాలంలో 15 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో అక్రమాస్తులు చీట్టా బయటపడింది. ఆయన ఇంట్లో రెండు కీలకమైన మెమెరీ కార్డులతో పాటు ఓ డైరీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ అధికారుల అంచనాల ప్రకారం డీఎస్పీ భీంరెడ్డి ఆస్తుల విలువ మూడు వందల కోట్లకు పైగా ఉంటుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చట్టపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు అత్యంత తెలివిగా వ్యవహరించాడు. ఆస్తులను కూడబెట్టే క్రమంలో మొదట తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకుని.. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లను రద్దు చేశాడు. వాటిని తన బినామీల పేరిట మర్చి.. తెరవెనుక సర్వహక్కులు అనుభవిస్తున్నట్టు దర్యాప్తులో తెలింది. విచారణ సమయంలోని భీంరెడ్డి ఏసీబీ అధికారులకు సహకరించలేదు. అక్రమ ఆస్తుల గురించి నోరుమెదపలేదు. సోదాల్లో పది బ్యాంక్ అకౌంట్లు, రెండు లాకర్లు గుర్తించారు.




