Karimnagar: మెగా హెల్త్ క్యాంప్.. నిపుణులైన డాక్టర్లతో ఉచిత పరీక్షలు!
Karimnagar: వీణవంక మండలం గంగారంలో ఆదర్శ హాస్పిటల్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.
Karimnagar: మెగా హెల్త్ క్యాంప్.. నిపుణులైన డాక్టర్లతో ఉచిత పరీక్షలు!
Karimnagar: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, గంగారం గ్రామంలో కీర్తిశేషులు కరివేద సదాశివరెడ్డి జ్ఞాపకార్థం ఆదర్శ హాస్పిటల్ కరీంనగర్ వారిచే బుధవారం రోజున ఉదయం 9:00గంటల నుండి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా CEO DR కరివేద సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మా నాన్న కరివేద సదాశివ రెడ్డి జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం మాకు సంతోషకరమని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే.ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు.
గత 25 సంవత్సరాలుగా మా నాన్న కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణలోనే రైతులందరికీ ఆడ, మగ, (వరి మొక్కజొన్న )సీడ్ విత్తనాలు అందజేసి రైతుల అభివృద్ధికి పాటుపడినరని వారి జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు భవిష్యత్తులో అన్ని గ్రామాలలో ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ తనకు సంధ్య మాట్లాడుతూ మా గ్రామంలో ఆదర్శ హాస్పిటల్ కరీంనగర్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తూ గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. అనంతరం ఆదర్శ హాస్పిటల్ వైద్యులను సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ హాస్పిటల్ వైద్య బృందం CEO DR సత్యనారాయణ ,
DR,సునిల్ రాజు,(జనరల్ సర్జన్) DR.ఉదయ్,
(కిడ్నీ నిపుణులు),
DRఆడెపు మానస(గైనకాలజిస్ట్),
DRచేతన(క్యాన్సర్ వ్యాధి నిపుణులు),
DR.మానస,సిబ్బంది, ఉపసర్పంచ్ కొండ వేణి హరీష్ ముదిరాజ్ మరియు మాజీ సర్పంచ్ నరహరి తిరుపతిరెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




