Adilabad: కలెక్టర్ ‘డిజిటల్’ షాక్.. యాప్‌తో గుడ్డు బరువు చూసి అక్రమాలు పట్టేసిన రాజర్షి షా!

Adilabad: ప్రభుత్వ యంత్రాంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తే అక్రమాలను ఇట్టే పట్టుకోవచ్చని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా నిరూపించారు.

Arun Chilukuri
Published on: 25 March 2026 1:04 PM IST
Adilabad
X

Adilabad: కలెక్టర్ ‘డిజిటల్’ షాక్.. యాప్‌తో గుడ్డు బరువు చూసి అక్రమాలు పట్టేసిన రాజర్షి షా!

Adilabad: ప్రభుత్వ యంత్రాంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తే అక్రమాలను ఇట్టే పట్టుకోవచ్చని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా నిరూపించారు. పాఠశాల తనిఖీకి వెళ్లిన ఆయన, వినూత్నంగా తన సెల్‌ఫోన్‌ను తూకపు యంత్రంగా మార్చి అధికారులకు చుక్కలు చూపించారు.

మంగళవారం భీంపూర్‌ మండలం అందర్‌బంద్‌ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ, బియ్యం మరియు నిత్యావసర సరకుల నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు.

మెనూలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే గుడ్ల నాణ్యతపై కలెక్టర్‌కు సందేహం వచ్చింది. వెంటనే తన సెల్‌ఫోన్‌లోని ‘డిజిటల్‌ స్కేల్‌’ (Digital Scale) యాప్‌ను తెరిచి, ఒక గుడ్డును దానిపై ఉంచి బరువు చూశారు. నిబంధనల ప్రకారం: ఒక్కో గుడ్డు 50-60 గ్రాములు ఉండాలి. కలెక్టర్ తనిఖీలో కేవలం 40 గ్రాములే ఉన్నట్లు యాప్ ద్వారా గుర్తించారు.

బరువు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోని మొత్తం గుడ్లను తూకం వేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి తనకు పంపాలని వార్డెన్‌ జ్ఞానేశ్వర్‌ను ఆదేశించారు. నిబంధనల ప్రకారం సరఫరా చేయని పక్షంలో గుత్తేదారుపై (కాంట్రాక్టర్) కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంకేతికతను ఉపయోగించి కలెక్టర్ చేసిన ఈ 'డిజిటల్' తనిఖీ ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story