Gudihathnoor: గుడిహత్నూర్‌లో అమానవీయ ఘటన.. జాతీయ రహదారిపై అప్పుడే పుట్టిన శిశువు!

Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో ఘోరం. అప్పుడే పుట్టిన మగ శిశువును జాతీయ రహదారిపై పడవేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 March 2026 7:44 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: గుడిహత్నూర్‌లో అమానవీయ ఘటన.. జాతీయ రహదారిపై అప్పుడే పుట్టిన శిశువు!

గుడిహత్నూర్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో గుండెలు విసిగించే అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసికందును కన్నవారో లేక గుర్తు తెలియని వ్యక్తులో నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేసి వెళ్లారు.

జాతీయ రహదారిపై పసికందు:

మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు శిశువును గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అదృష్టవశాత్తూ శిశువు ప్రాణాలతో ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు:

సమాచారం అందుకున్న వెంటనే గుడిహత్నూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిశువును వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన వారు ఎవరు? శిశువును ఎక్కడి నుండి తీసుకువచ్చారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పసికందును రోడ్డు పాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story