Telangana: 22ఏ భూముల వివాదంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న మహేశ్వర్ రెడ్డి!
Telangana: రాష్ట్రంలో 22ఏ భూముల కుంభకోణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరిన బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
Telangana: 22ఏ భూముల వివాదంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న మహేశ్వర్ రెడ్డి!
Telangana: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనడానికి ఉదాహరణ మంత్రి పొంగులేటి క్షేమాపణ చెప్పడమే లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో చేరడం చిన్న తప్పిదమా?
22ఏ నిషేధిత జాబితా వెనక ఉన్న కుట్రదారుని బయట పెట్టాలి. లక్షలాది భూమి నిషేధిత జాబితాలో చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.రాష్ట్రంలో భూ సంక్షోభం జరుగుతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల మీద విహార యాత్రకు వెళ్లడం మంచిది కాదు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అయ్యాక ఫీనిక్స్ నుంచి 15 వేల కోట్ల ఆస్తుల బదలాయింపు ఎట్లా జరిగింది. రేపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద 12 నుంచి 2 గంటల వరకు ఆధారాలతో కూర్చుంటా, పొంగులేటికి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చకు రాకపోతే ఇవే ఆధారాలను దర్యాప్తు సంస్థలకు ఇస్తా, రాఘవ కంపెనీ గత ప్రభుత్వ తప్పిదాలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అరాచకానికి పాల్పడుతోంది.
గత ప్రభుత్వం హయాంలో నిషేధిత జాబితాలో ఎంత భూమి ఉంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిషేదిత జాబితాలో ఎంత భూమి ఉందో శ్వేత పత్రం విడుదల చేయాలి.
ఫీనిక్స్ కంపెనీ బీఆర్ఎస్ కు బినామీ అన్న ముఖ్యమంత్రి దానిపైన సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వడం లేదు, రాహుల్ గాంధీకి వాటా ఉన్నట్లు మాకు అనుమానం కలుగుతుంది.భూ దందా మీద రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాస్తా. కేటీఆర్ బినామీ అయిన ఫీనిక్స్ మీద ఆయన మాట్లాడరు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చేసిన జాయింట్ వెంచర్ లూటీ, లక్షల కోట్ల అవినీతిపైన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.




