Armoor: వెల్మల్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Armoor: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 April 2026 5:57 PM IST
Armoor
X

Armoor: వెల్మల్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Armoor: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామం లో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపి నివాళులు అర్పించిన డిసిసి అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, మరియు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ ఉత్సవాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ వారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసారని, మన దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయులు అని కొనియాడారు.

ఈ రోజు మనం ఇంత సేచ్చగా జీవిస్తున్నం అంటే దానికి అంబేద్కర్ అని తెలిపారు.దేశ మొదటి న్యాయ మంత్రిగా పనిచేసిన ఘనత మరియు వారు తీసుకున్న నిర్ణయాలతో మహిళలకు అన్ని విధాలుగా మేలు చేసారని తెలిపారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షులు గదారి( వెల్మల్ ) గోపి గారు నిర్వహించిన సహాపంక్తి భోజనం లో గ్రామస్థులతో కలిసి జిల్లా నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో TPCC అధికార ప్రతినిధి A B చిన్న, మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వెంకట్ రాం రెడ్డి, గాదరి గోపి, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, ఏఎంసీ ఛైర్మెన్ సాయిబాబా గౌడ్, మండల్ సర్పంచ్లు ఎర్రం లింగం,శాంతి, గాదరి నవీన్,సంతోష్ గౌడ్, శ్రీకాంత్ మెండు, మహేష్ ,ఆర్మూర్ కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు ,ప్రజలు భారీగా పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story