Amit Shah: హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..!
Amit Shah: హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం, నిజాం కాలేజ్ నుంచి మోజంజాహి మార్కెట్ వరకు మహా పాదయాత్ర.
Amit Shah: హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..!
Amit Shah: హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. "లోక్తంత్ర బచావో - అరాచకత్వ హటావు" నినాదంతో బీజేపీ తలపెట్టిన మహా పాదయాత్రలో అమిత్ షా ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అధికారిక కార్యక్రమాలు, పార్టీ ప్రముఖులతో భేటీలు మరియు భారీ బహిరంగ ప్రసంగం ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అమిత్ షా పర్యటన ఫుల్ షెడ్యూల్ వివరాలు:
మధ్యాహ్నం 1:10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు నేరుగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 2:15 గంటలకు కాకతీయ హోటల్‌కు చేరుకుని భోజనం (లంచ్) చేస్తారు. అనంతరం వివిధ రంగాల ప్రముఖులు, సామాజిక వేత్తలు, రాజకీయ విశ్లేషకులు మరియు రాష్ట్రంలోని కీలక బీజేపీ నేతలతో సమావేశమై రాష్ట్రంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలు మరియు భవిష్యత్ వ్యూహాలపై చర్చిస్తారు.
సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు నిజాం కాలేజ్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి మోజంజాహి మార్కెట్ (ఎంజీ మార్కెట్) వరకు గంట పాటు సాగే భారీ పాదయాత్రలో అమిత్ షా అడుగులు వేయనున్నారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
సాయంత్రం 5:15 నుండి 5:30 గంటల వరకు పాదయాత్ర ముగింపు సందర్భంగా మోజంజాహి మార్కెట్ ప్రాంతంలో ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా కీలక ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత అమిత్ షా తొలిసారిగా హైదరాబాద్‌కు వస్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు మరియు ఇతర రాజకీయ అంశాలపై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేలా ఈ పర్యటన వ్యూహాత్మకంగా సాగనుంది.




