Armoor: జర మా సమస్యను పట్టించుకోండి సార్.. అపార్ట్మెంట్ వాసుల వినతి
Armoor: ఆర్మూర్ పట్టణంలోని 8వ వార్డు ఆదిత్య అపార్ట్మెంట్ వాసులు తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
Armoor: జర మా సమస్యను పట్టించుకోండి సార్.. అపార్ట్మెంట్ వాసుల వినతి
ఆర్మూర్ న్యూస్: జిల్లా పట్టణ 8వ వార్డు లో నివసిస్తున్న అపార్ట్మెంట్, ఆపోజిట్ సెంట్ పాల్ స్కూల్ వీధిలో,రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటున్న ఆదిత్య అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారు అంతా కలిసి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఎలక్ట్రిసిటీ ఏఈ లకు వినతి పత్రం అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ, మేమంతా 2020 సంవత్సరం నుంచి 20 కుటుంబాలు ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాము, మేము ఉన్నప్పటి నుంచి మా అపార్ట్మెంట్ ఆవరణలో ఎలాంటి స్ట్రీట్ లైట్స్ లేవు, డ్రైనేజ్ గాని, అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్న చెత్త గాని ఏ ఒక్క మున్సిపల్ సఫాయి వచ్చి క్లీన్ చేసింది లేదు, ఎప్పటినుంచో మా బాధను ఎన్నిసార్లు గత సంవత్సరం కౌన్సిలర్లకు చెప్పిన గాని, మా సమస్యను పట్టించుకునే నాధుడు లేకుండా అయిపోయాడు,
ఇటీవల మేము ఓట్లు వేసి గెలిపించిన కౌన్సిలర్ కూడా మా అపార్ట్మెంట్ వైపు చూడడం లేదు, ఇకనైనా మా వీధి యందు దయచూపి, మా యొక్క సమస్యని పరిష్కారం చేయాలంటూ, మేము వచ్చి ఐదు సంవత్సరాలు అయినా గాని, మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు, అది గమనించండి సార్ అంటూ వార్డ్ కౌన్సిలర్, కమిషనర్‌ను, ఎలక్ట్రిసిటీ ఏఈ అపార్ట్మెంట్ వాసులు అధికారులను ను కోరడం జరిగింది.




