Armoor: ఆర్మూర్ ఈద్గాలో వినయ్ కుమార్ రెడ్డి సందడి

Armoor: ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 March 2026 4:47 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ ఈద్గాలో వినయ్ కుమార్ రెడ్డి సందడి

ఆర్మూర్ (నిజామాబాద్ జిల్లా): పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నిజామాబాద్ క్రాస్ రోడ్డులోని పెద్దమ్మతల్లి టెంపుల్ కమాన్ ఎదురుగా ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని, ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

మానవత్వానికి ప్రతీక 'జకాత్':

ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సమాజంలో శాంతి, సౌభాతృత్వానికి ప్రతీక అని కొనియాడారు. నెల రోజుల పాటు అత్యంత నిష్టతో, క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు ముగించుకుని జరుపుకునే ఈ పండుగ విశిష్టమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచిపెట్టే 'జకాత్' సంప్రదాయం ముస్లింల గొప్ప మానవత్వాన్ని చాటి చెబుతుందని ఆయన అన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం:

తెలంగాణ రాష్ట్రం భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమని, అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో కలిసి మెలిసి పండుగలు జరుపుకోవడం మన సంస్కృతి అని గుర్తు చేశారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఈద్ ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మరియు మైనారిటీ పెద్దలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story