Armoor: మహిళా ప్రాంగణంలో ఘోరం.. యువతుల వీడియోలతో బ్లాక్మెయిలింగ్
Armoor: ఆర్మూర్ దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ విద్యార్థినుల వీడియోలను AI యాప్స్ ద్వారా మార్ఫింగ్ చేసి వేధిస్తున్న టీచర్ స్నేహ.
Armoor: మహిళా ప్రాంగణంలో ఘోరం.. యువతుల వీడియోలతో బ్లాక్మెయిలింగ్
Armoor: ఆర్మూర్ న్యూస్: జిల్లా ఆర్మూర్ పట్టణ పెర్కిట్ చివర గల దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో చోటు చేసుకున్న బుటిషియన్ ట్రైనింగ్ బాలికల , యువతులకు కోర్సు నిర్వహించడం జరిగింది.
అసలేం జరిగింది మహిళా ప్రాంగణంలో:
మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ కొరకు కోర్స్ నేర్చుకుంటున్న బాలికల, యువతలకు బ్యూటిషన్ తాత్కాలిక ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ ఇచ్చే టీచర్ స్నేహ , నేర్చుకునే వారికి శిక్షణ కోర్స్ ఇవ్వడమే కాకుండా, బాలికల యువతల వీడియోలు తీసి టీచర్ అక్రమ సంబంధం పెట్టుకున్న సతీష్ కి బాలికల యువతల ఫొటోస్, వీడియోస్ నంబర్స్ తో పంపడం జరిగింది, సతీష్ ఆ వీడియోలు చూసి AI యాప్ సహకారంతో వీడియోలను మార్పింగ్ చేస్తూ ఆ బాలికలకు యువతులకు పంపించి, వారికి కాల్ చేస్తూ బ్లాక్ మెయిల్ , వేధింపులకు గురి చేయడం జరిగింది, దీనిపై దుర్గాబాయి మహిళా జిల్లా మేనేజర్ పి ఇందిరా, ఈ విషయంపై పై అధికారులకు తెలపడం జరిగింది.
మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్:
ఈ ఘటనపై జిల్లా మేనేజర్ ఇందిర ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని, పై అధికారులు కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటన వివరించి ఫిర్యాదు చేయడం జరిగింది.
జిల్లా కలెక్టర్ ఇలా తిపాఠి:
ఈ ఘటన పై విషయాలు తెలుసుకున్న కలెక్టర్ దీనిపై తీవ్రంగా పరిగణిస్తూ స్పందించి , అధికారులను , పోలీసులను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని, దీనిపై వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలని , ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
నియోజవర్గ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి:
ఈ విషయంపై విద్యాసంస్థలు యూనియన్లు ఎమ్మెల్యేను కలిసి , దీని వివరణ ఇవ్వడంతో ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్కు, పట్టణ పోలీసులకు ఫోన్ చేసి నేరస్తులను శిక్షించి, వెంటనే ఎఫ్ఐ ఆర్ చేసి అరెస్టు చేయాలన్నారు , పోలీసులు దీనిపై వెంటనే స్పందించి సతీష్ ని , స్నేహాలను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.
బాలికల, యువతల తల్లిదండ్రులు ప్రాంగణంలో ఆందోళన:
మా పిల్లలను బ్యూటీషియన్ ఉచిత కోర్స్ నేర్చుకుంటామంటే, మేము ఆలోచించకుండా వెంటనే, తెలంగాణ అభివృద్ధి సహకార సంస్థ మంచి పేరు ఉందని , మేము పంపించడం జరిగింది , కానీ అక్కడ క్రమశిక్షణగా లేని టీచర్ స్నేహ కోర్స్ చెప్పకుండా వీడియోలు తీసి పంపడం కరెక్ట్ కాదన్నారు, నేరస్తులను మాకు వెంటనే అప్పగించండి , మేమే శిక్ష వేస్తాము, పోలీసులు మీరు అరెస్టు చేసి జైలు పంపిస్తారు, తల్లిదండ్రులు మాకు న్యాయం జరిగే దాకా మేము ఊరుకోనని అన్నారు.




