Armoor: కౌన్సిలర్ సీటులో కొడుకు.. ఎమ్మెల్యేపై వేలెత్తి చూపిస్తూ రగడ

Armoor: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది.

VAMSHI, ARMOOR
Published on: 18 April 2026 6:07 PM IST
Armoor
X

Armoor: కౌన్సిలర్ సీటులో కొడుకు.. ఎమ్మెల్యేపై వేలెత్తి చూపిస్తూ రగడ

Armoor: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించే సమయంలో ఏ పార్టీ సంబంధం లేకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటూ అంకాపూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి స్థలం ఉందంటూ, అక్కడ అయితే చాలా బాగుంటుందంటూ అధికారులు, కౌన్సిలర్, కౌన్సిలర్లతో చర్చించారు.

అసలేం ఏం జరిగింది ఈ సమావేశంలో..

ఎమ్మెల్యే అభివృద్ధి గురించి చర్చించక అధికారులతో ఓ కౌన్సిలర్ కాకుండా గాని భారడ్ రమేష్ అనే వ్యక్తి, తన ఇష్టానుసారంగా నార్మల్ పద్ధతిగా కుర్చీపై కూర్చోకుండా, కాలుపై కాలేసుకుని కూర్చోవడమే కాకుండా ఎమ్మెల్యే పై తిరగబడుతూ, అక్కడ ఆ స్కూల్ ని అంకాపూర్ లో కాకుండా, ఇక్కడ వీర దగ్గర స్థలం ఉంది, ఈ విషయంపై మీరు అధికారుల తో కలిసి స్థలం చూసి ముందుకెళ్లండి అంటూ వేలెత్తి చూపడం జరిగింది,

అక్కడ ఉన్న బిజెపి కౌన్సిలర్లు రమేష్ ను నువ్వు కౌన్సిలర్ కాకుండా, లోపటికి ఎందుకు వచ్చావు, నీ పద్ధతి మార్చుకోవాలి, అంటూ మీ చైర్ పర్సన్ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండడంతో , నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే కొనసాగిస్తాను అంటే, ఎవ్వరు ఊరుకోరు, ఇది ఇలాగనే కొనసాగిస్తే మేము సరైన బుద్ధి చెప్తామంటూ బిజెపి పట్టణ అధ్యక్షుడు,నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

మా ఎమ్మెల్యే నియోజవర్గ ప్రజల ఓట్లతో ప్రజలు గెలిపించుకున్నారు, ఇప్పటిదాకా గెలిచిన తర్వాత నియోజవర్గంలో ఎమ్మెల్యే పై ఎలాంటి మచ్చ లేదన్నారు, ఈ ఘటన కాస్త పెద్ద కావడంతో అక్కడ ఉన్న పోలీసులు రమేష్ ను బయటకు తీసుకెళ్లారు.

ఎవరు ఈ వ్యక్తి భారడ్ రమేష్..

భారడ్ రమేష్ అనే వ్యక్తి గత మున్సిపల్ ఎలక్షన్లో లో 36 వ వార్డ్ మాజీ కౌన్సిలర్, మొన్న ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో ఆ వార్డ్ మహిళా రిజర్వేషన్ రావడంతో, రమేష్ తన అమ్మను కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దించారు, అయితే 36 వ వార్డ్ కౌన్సిలర్ గా తన అమ్మ అయినా భారడ్ గంగామణి గెలిచారు, ఇప్పుడు మున్సిపల్ లో ఏ సమావేశం జరిగినా గాని, కౌన్సిలర్లు ఎవరెవరైతే ఉంటారు,

వారే పాల్గొనాలి, కానీ ఇక్కడ వారి అమ్మ ప్లేస్ లో రమేష్ పాల్గొని ఎమ్మెల్యే పై ఇష్టఅనుసారంగా వేవరించడం సరి కాదు అంటున్నారు బిజెపి కౌన్సిలర్లు,కార్యకర్తలు. ఈ సమావేశ ఘటన ఎమ్మెల్యే పై అలా ప్రవర్తించడంతో నియోజవర్గ ఉన్న అన్ని పొలిటికల్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు , నియోజవర్గ ప్రజలకు ఈ విషయం కాక ఇకపై ఏం జరుగుతుందంటూ చర్చ నీ అంశంగా మారింది.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story