Armoor: పెండింగ్ బిల్లుల కోసం ఆర్మూర్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన

Armoor: ఆర్మూర్ పట్టణ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీజీఈ జేఏసీ (TGEJAC) ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ నిరసన చేపట్టారు.

VAMSHI, ARMOOR
Published on: 17 April 2026 5:20 PM IST
Armoor
X

Armoor: పెండింగ్ బిల్లుల కోసం ఆర్మూర్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన

Armoor: TGEJAC తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నిజామాబాద్ జిల్లా చైర్మన్ శ్రీ నశెట్టి సుమన్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ప్రధానంగా క్రింది డిమాండ్లు ఉంచారు:

1. 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి.

2. అన్ని రకాల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి.

3. ఈహెచ్‌ఎస్ ఆరోగ్య కార్డులను మే 1 నుండి అమల్లోకి తీసుకురావాలి.

4. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను వెంటనే పునరుద్ధరించాలి.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ శ్రీ అభిగ్యాన్ మాల్వియా, ఐఏఎస్ వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్లపై స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కే. శశికాంత్ రెడ్డి (TNGOs), ఇ. గోపాల్ (PRTU), గంగాధర్ (PRTU), శ్రీకాంత్ (Revenue), శ్రీనివాస్ రెడ్డి (రిటైర్డ్ ఎంప్లాయీస్), పెంట జలంధర్, తుమ్మల లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి, యన్. విశాల్, రాంరెడ్డి, డి. భరత్, అశోక్, విక్రమ్, సాయికుమార్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story