Khammam: బ్రిటిష్ రూల్స్ మాకొద్దు.. విద్యుత్ కార్మికుల పోరుబాట!
Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో TVAE JAC పిలుపు మేరకు విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది.
Khammam: బ్రిటిష్ రూల్స్ మాకొద్దు.. విద్యుత్ కార్మికుల పోరుబాట!
ఖమ్మం జిల్లా: సత్తుపల్లి లో TVAE JAC రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 7వ రోజు నిరవధిక సమ్మెకు ఆర్టిజన్ UN -MAN. పీస్ రేట్ కార్మికులు తమ విధులు బహిష్కరించి సత్తుపల్లి డివిజన్ ఆఫీస్ ముందు టెంటు వేసుకొని తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డివిజన్ చైర్మన్ శ్రీ గుగులోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో రెండు రకాల సర్వీసు రూల్స్ ను అమలు పరుస్తూ మా ఆర్టిజన్ కార్మికులకు బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ రూల్స్ ను ఆర్టిజన్ కార్మికులపై అమలుపరిచి తీరని అన్యాయం చేసినారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ను మరియు గృహ ఉపకారాలకు మరియు పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేసే మా శ్రమను దోపిడీకి గురి చేస్తున్నారు.
కావున యాజమాన్యం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మా TVAE JAC కమిటీ కోరుతుంది.
మా యొక్క డిమాండ్ :-
1. ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలి.
2. UN-MAN కార్మికులను ఆర్టిజంగా గుర్తించాలి.
3. పీస్ రేట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
4. ఆర్టిజన్ కార్మికుల విద్యార్ధంగా కన్వర్షన్ చేయాలి
5. 2026 PRC ని అమలు చేయాలి.
ఈ కార్యక్రమంలో రాందాస్ నాయక్. నాగేశ్వరావు. శ్రీను. నర్సింహా రావు. కనకదుర్గ. చంద్రకళ ఆర్టిజన్ కార్మికులు మరియు UN -MAN కార్మికులు పీస్ రేట్ కార్మికులు పాల్గొన్నారు.




