Karimnagar: అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.. ఆశా కార్యకర్తల ఆగ్రహం
Karimnagar: తమ సమస్యల పరిష్కారం కోసం 'చలో హైదరాబాద్'కు బయలుదేరిన ఆశా కార్యకర్తలను కరీంనగర్ పోలీసులు అడ్డుకున్నారు.
Karimnagar: అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.. ఆశా కార్యకర్తల ఆగ్రహం
కరీంనగర్: ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యకర్తలను నిలువరించిన పోలీసులు. హైదరాబాద్ కు వెళ్తున్న కార్యకర్తలను ఎక్కడి వాళ్ళను అక్కడనే అరెస్టు చేసి సెంటర్ కి తరలించిన పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానన్న వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఆశా కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తుందని మండిపడ్డారు. పోలీసులు ఆశా కార్యకర్తలను అరెస్టు చేస్తున్న సమయంలో తీవ్ర ఉదిరిక్తత పరిస్థితి ఏర్పడ్డది.
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలకు వాగ్దానం చేసిన వాటిని అమలు చేయాలని గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన స్పందించడం లేదని కార్యకర్తలు అన్నారు. ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఇలాంటి గొంతెమ్మ కోరికలు లేవని ప్రభుత్వాన్ని వేడుకున్న అందించకుంటే నేడు చలో హైదరాబాద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
సమస్యలు వివరించడానికి వెళుతున్నాం తప్ప అక్కడ ధర్నాలు చేయడానికి కాదని ఇది పోలీసులు గమనించి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశాలు కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. కనికరించని పోలీసులు కఠినంగా వ్యవహరించి బలవంతంగా ఆశా కార్యకర్తలను నిలువరించి పిటిసి కి తరలించారు.




