Veldanda: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర.. ఐక్య పోరాటాలకు పిలుపు

Veldanda: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కల్పించడంలో ప్రభుత్వాలు, అధికారులు వైఫల్యం చెందారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి. వీరశేఖర్ విమర్శించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 8:58 PM IST
Veldanda
X

Veldanda: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర.. ఐక్య పోరాటాలకు పిలుపు

Veldanda: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా ఉన్నటువంటి ఉపాధి హామీ పనులు ఎక్కడని, ఉపాధి కోసం ప్రజలు గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేస్తున్నా ఉపాధి హామీ పనులు కల్పించడం లేదని వెంటనే గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ డిమాండ్ చేశారు.

నాడు మండలంలోని తేర్నేకల్ గ్రామంలో కామ్రేడ్ ఈశ్వరరెడ్డి భవన్ లో వ్యవసాయ కార్మిక సంఘం ఐదవ మండల మహాసభ వీరేంద్ర నాయుడు అధ్యక్షతన అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరశేఖర్ ప్రస్తుత సీజన్లో జిల్లాలో లక్షకు పైగా కూలీలు పనిచేయాల్సిన ఉండగా జిల్లావ్యాప్తంగా కూలీల హాజరు పది వేలకు మించడం లేదని దీనికి ప్రభుత్వాలు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నిబంధనలు బూచిగా చూపెట్టి ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉన్న చోటే ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి పేదలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఉపాధి హామీ పథకంతో పేదలలో ఆత్మగౌరవం, ఆత్మ అభిమానం వచ్చిందని, ప్రజలను బానిసలుగా చేసే విధానాల వైపు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని బి విమర్శించారు జిల్లాలో వెంటనే అడిగిన వారందరికీ పని కల్పించాలని డిమాండ్ చేశారు పెరుగుతున్న మండుటెండల నేపథ్యంలో పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని,

తాగునీటి వసతి, టెంటు మెడికల్ కిట్ వంటి సదుపాయాలు కల్పించాలని పని ప్రదేశాల్లో కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టంపై ప్రభుత్వాల చర్యలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిద్దమని ఆయన పిలుపునిచ్చారు వ్యవసాయ కార్మిక సంఘంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు పాత పద్ధతిలోనే పేరు మరియు పనిని కొనసాగించేందుకు విస్తృత పోరాటాలతో ప్రజల లోకి వెళుతుందని ఆయన పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మహబూబ్ బాషా సిఐటియు మండల కార్యదర్శి అశోక్, సంఘం నాయకులు బజారి, దొడ్డప్ప ,పరమేష్, రాముడు, సుంకన్న, రామాంజనేయులు వీరప్ప రంగన్న, లాలు, వెంకటేష్, ఈరప్ప ,సుభాన్ అనిల్, ఐసా, పురుషోత్తం కౌలుట్ల, లక్ష్మారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కే మహబూబ్ భాషా, కార్యదర్శిగా వీరేంద్రనాయుడు, ఉపాధ్యక్షులుగా దొడ్డప్ప, రాముడు, సహాయ కార్యదర్శిగా సుంకన్న, వెంకటేష్ కమిటీ సభ్యులుగా మరో 9 మందిని ఎన్నుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story