Balapur Ganesh Laddu Auction 2026: ముగిసిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట.. రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలకు దక్కించుకున్న వ్యక్తి!
Balapur Ganesh Laddu Auction 2026: అత్యంత ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట ఉత్సాహంగా ముగిసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలకు సామా ప్రణీత్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.
Balapur Ganesh Laddu Auction 2026: ముగిసిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట.. రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలకు దక్కించుకున్న వ్యక్తి!
Balapur Ganesh Laddu Auction 2026: హైదరాబాద్‌లోని ప్రసిద్ధ గణేష్ ఉత్సవాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట అత్యంత కోలాహలంగా ముగిసింది. వినాయక చవితి నవరాత్రుల్లో ప్రత్యేక పూజలందుకున్న స్వామివారి చేతిలో పెట్టిన పవిత్ర లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు తీవ్రంగా పోటీపడ్డారు.
ఈ ఏడాది ఈ వేలంలో పాల్గొనేందుకు నిబంధనల ప్రకారం పలువురు తమ పేర్లను నమోదు చేసుకోగా, ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో సామా ప్రణీత్‌రెడ్డి రికార్డు స్థాయిలో రూ.39 లక్షలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు.
ప్రతిఏటా వినాయక నిమజ్జన రోజున ఉదయం నిర్వహించే ఈ లడ్డూ వేలంపాటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ లడ్డూను దక్కించుకుంటే ఐశ్వర్యసమృద్ధి, అదృష్టం కలుగుతాయని భక్తుల బలమైన నమ్మకం. ఈ వేలం పాట ముగిసిన వెంటనే బాలాపూర్ మహా గణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది.




