Balka Suman: అవన్నీ మూర్ఖపు మాటలు.. హరీష్‌రావు ఢిల్లీ పర్యటనపై బాల్క సుమన్ క్లారిటీ!

Balka Suman: హరీష్‌రావు బీజేపీలో చేరుతున్నారన్న వ్యాఖ్యలను బాల్క సుమన్ ఖండించారు. పార్టీ పనుల కోసమే ఆయన ఢిల్లీ వెళ్లారని క్లారిటీ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 20 April 2026 5:13 PM IST
Balka Suman
X

Balka Suman: అవన్నీ మూర్ఖపు మాటలు.. హరీష్‌రావు ఢిల్లీ పర్యటనపై బాల్క సుమన్ క్లారిటీ!

Balka Suman: మాజీ మంత్రి హరీష్‌రావు బీజేపీలో చేరబోతున్నారంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంజయ్ వ్యాఖ్యల్లో కనీస వాస్తవం లేదని, కేవలం రాజకీయ ఆక్రోశంతోనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణం ఇదే:

హరీష్‌రావు ఢిల్లీ పర్యటనపై వస్తున్న ఊహాగానాలకు బాల్క సుమన్ తెరదించారు. "పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే హరీష్‌రావు ఢిల్లీ వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు మరియు పార్టీ ఫిరాయింపుల అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకునేందుకే ఆయన అక్కడికి వెళ్లారు తప్ప, పార్టీ మారుతున్నారన్న వార్తల్లో నిజం లేదు" అని స్పష్టం చేశారు.

కేటీఆర్ రాకపోతే గ్యాప్ ఉన్నట్టా?

బీఆర్ఎస్ సభకు హరీష్ రానంత మాత్రాన పార్టీలో ముసలం పుట్టిందనడం మూర్ఖత్వమేనని సుమన్ విమర్శించారు. "నేటి సభకు కేటీఆర్ కూడా హాజరవడం లేదు.. మరి ఆయనకు కూడా పార్టీతో గ్యాప్ ఉన్నట్టా? ఇలాంటి అవాకులు చవాకులు మానుకోవాలి" అని హెచ్చరించారు.

జీవన్ రెడ్డిపై విమర్శలకు కౌంటర్:

జీవన్ రెడ్డిని 'ఐరన్ లెగ్' అంటూ సంజయ్ చేసిన విమర్శలను సుమన్ తిప్పికొట్టారు. "జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అయితే.. ఆయన ఇంటికి మంత్రులు, టీపీసీసీ చీఫ్ ఎందుకు వెళ్లారు? కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం ఎందుకు చేసింది?" అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఐక్యంగా ఉందని, విపక్షాల కుట్రలు ఫలించవని బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story