Bandi Bhagirath: మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్.. పరారిలో బండి భగీరత్..!
Bandi Bhagirath: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరత్ పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Bandi Bhagirath: మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్.. పరారిలో బండి భగీరత్..!
Bandi Bhagirath: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్ పరారిలో ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో నమోదైన పోక్సో (POCSO) కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. గత మూడు రోజులుగా భగీరత్ ఆచూకీ లభ్యం కాకపోవడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ సోమవారం సాయంత్రం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆమె మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. గత మూడు రోజులుగా భగీరత్ తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారిలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ఎవరితో టచ్‌లో ఉన్నాడు, చివరిగా ఏ ప్రాంతంలో ఉన్నాడు అనే కోణంలో అతని కాల్ డేటా రికార్డ్స్ (CDR)ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ ఒకసారి రికార్డ్ చేశామని, అయితే కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున మరోసారి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని విచారణాధికారి తెలిపారు.
ఈ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఫిర్యాదు అందినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరిగిందని డీజీపీని ప్రశ్నించారు. తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఇటీవల ఒక ఫామ్‌హౌస్‌లో తనపై భగీరత్ లైంగిక దాడికి పాల్పడ్డారని 17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు చేయడంతో పేట్‌బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఆ బాలిక కుటుంబం తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తోందని, రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తోందని భగీరత్ కూడా కౌంటర్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ రెండు కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.




