Bandi Bhagirath: పోక్సో కేసులో కీలక పరిణామం.. బండి భగీరథను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు!
Bandi Bhagirath: పోక్సో (POCSO) కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథను పోలీసులు చర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు.
Bandi Bhagirath: పోక్సో కేసులో కీలక పరిణామం.. బండి భగీరథను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు!
Bandi Bhagirath: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న బండి భగీరథను పేట్ బషీరాబాద్ పోలీసులు చర్లపల్లి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయస్థానం అనుమతితో నిందితుడిని మూడు రోజుల పాటు (3 Days Custody) పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించనున్నారు.
చర్లపల్లి జైలు నుంచి భగీరథను కస్టడీలోకి తీసుకున్న వెంటనే పోలీసులు ముందస్తు నిబంధనల ప్రకారం భారీ భద్రత నడుమ మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిందితుడికి వైద్య పరీక్షలు (Medical Tests) పూర్తి చేసిన అనంతరం, విచారణ నిమిత్తం రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. బాధితురాలైన బాలికతో పాటు, ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలం (Statement) ఆధారంగా పోలీసులు భగీరథను ప్రశ్నించనున్నారు.
ఈ పోక్సో కేసులో అసలేం జరిగింది? ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కీలక కోణాల్లో పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుడి నుంచి వివరాలు రాబట్టనున్నారు. మూడు రోజుల కస్టడీ ముగిసిన అనంతరం నిందితుడిని తిరిగి న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు.




