బండి భగీరథ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్: తెరపైకి కొత్త సెక్షన్.. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం?
Bandi Sai BhagirathCase Update: తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న బండి సాయి భగీరథ్ కేసులో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
బండి భగీరథ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్: తెరపైకి కొత్త సెక్షన్.. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం?
Bandi Sai BhagirathCase Update: తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న బండి సాయి భగీరథ్ కేసులో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేసిన కొద్దీ ఈ కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిందితుడు బండి భగీరథ్‌పై పోలీసులు తాజాగా మరో అత్యంత కఠినమైన కొత్త సెక్షన్‌ను జోడించారు. దీంతో ఆయనకు ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టం ప్రకారం మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి.
కేసు తీవ్రతను బట్టి సేకరించిన ఆధారాల ఆధారంగా పోలీసులు ఈ కేసులో నూతన న్యాయ సంహితలోని తీవ్రమైన సెక్షన్‌ను చేర్చారు. ఒకే బాధితురాలిపై ఒకటికి మించి పలుమార్లు (Repeatedly) అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారిస్తూ.. భగీరథ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 64(2)(m) సెక్షన్‌ను అదనంగా నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే శిక్ష తీవ్రత అత్యంత కఠినంగా ఉండే అవకాశం ఉందని చట్టపరమైన నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం కేసులో పెద్ద ట్విస్ట్‌గా మారింది.
మరోవైపు, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న బండి సాయి భగీరథ్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. సోమవారం జైలు నిబంధనల ప్రకారం ములాఖత్ కోరిన కుటుంబ సభ్యులు.. భగీరథ్‌ను పరామర్శించనున్నారు. కొత్త సెక్షన్లు చేర్చడం, కేసు మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో లీగల్ టీమ్‌తో కలిసి తదుపరి బెయిల్ పిటిషన్ వ్యూహాలపై వారు చర్చించే అవకాశం ఉంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సైతం నిరంతరం హాట్ టాపిక్‌గా మారుతోంది.




