Bandi Sanjay: కేసీఆర్‌ను కాపాడటానికే రేవంత్ ప్రయత్నం: కాళేశ్వరం తీర్పుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Bandi Sanjay: కాళేశ్వరం తీర్పుపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్‌ను కాపాడటానికే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీకి మూటలు అందుతున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాలు ఇక్కడ.

Arun Chilukuri
Published on: 22 April 2026 3:29 PM IST
Bandi Sanjay
X

Bandi Sanjay: కేసీఆర్‌ను కాపాడటానికే రేవంత్ ప్రయత్నం: కాళేశ్వరం తీర్పుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Bandi Sanjay: కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, సీఎం రేవంత్‌ కాంప్రమైజ్ పాలిటిక్స్‌కు కాళేశ్వరమే ఉదాహరణ అన్నారు. హైకోర్టులో సరైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు బండి సంజయ్. పీసీ ఘోష్ కమిషన్‌ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందన్నారు.

కేసీఆర్‌ను కాపాడటానికే రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన బండి సంజయ్.. లక్ష కోట్ల కాళేశ్వరం స్కామ్‌పై కాకుండా 9వేల కోట్లపైనే విచారణ జరపాలని కోరడం అందులో భాగమేనన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అందుతుంటే ఇక్కడ కేసులు క్లోజ్ అవుతున్నాయని ఆరోపించారు బండి సంజయ్. కేసీఆర్, రేవంత్ రెడ్డి క్విడ్‌ ప్రో కో వ్యవహారాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story