Karimnagar: బేడ బుడగ జంగం ప్రతినిధులకు ఆత్మీయ సత్కారం.. హాజరైన మేయర్

Karimnagar: కరీంనగర్‌లో బేడ బుడగ జంగం రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఘన సన్మానం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 9:23 PM IST
Karimnagar
X

Karimnagar: బేడ బుడగ జంగం ప్రతినిధులకు ఆత్మీయ సత్కారం.. హాజరైన మేయర్

Karimnagar: కరీంనగర్‌లో బేడ బుడగ జంగం రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం కులం నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించిన భూపతి రవీందర్ ని వేదికపై ఘనంగా సత్కరించారు. ఆయన సాధించిన విజయం బేడ బుడగ జంగం సమాజానికి గర్వకారణమని పలువురు నాయకులు పేర్కొన్నారు.

సమాజం రాజకీయంగా మరింత ముందుకు రావడానికి ఇలాంటి నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు విచ్చేసి అభినందనలు తెలియజేసి, బేడ బుడగ జంగం సమాజం సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షులు ఆల్ ఇండియా బేడ బుడగ జంగం కాన్ఫెడరేషన్ డాక్టర్ ఎన్ఆర్ వెంకటేశం మాట్లాడుతూ సమాజ ఐక్యత, రాజకీయ చైతన్యం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కడమంచి సహదేవుడు (రాష్ట్ర అధ్యక్షులు – బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి), సిరిపాటి వేణు (రాష్ట్ర అధ్యక్షులు – బేడ బుడగ జంగం జన సంఘం), మోటం రామ్ కుమార్ (బేడ బుడగ జంగం నాయకులు) ప్రోగ్రాం ఆర్గనైజర్ కళ్యాణం శరత్ చంద్ర, బేడ బుడగ జంగం మేధావుల ఫోరం నాయకులు, డాక్టర్ కళ్ళెం ఆంజనేయులు, రిటైర్డ్ టీచర్ నరసింహ లతోపాటు బేడ బుడగ జంగం జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, స్థానిక నాయకులు, యువజన నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story