Bhadrachalam ACB Trap: ఏసీబీ వలలో చిక్కిన భద్రాచలం అటవీశాఖ అధికారులు
Bhadrachalam ACB Trap: భద్రాచలం అటవీశాఖలో ఏసీబీ దాడులు. రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ ఎఫ్‌డీవో సుజాత, డీఆర్‌వో కృష్ణయ్య పట్టుబడ్డారు.
Bhadrachalam ACB Trap: ఏసీబీ వలలో చిక్కిన భద్రాచలం అటవీశాఖ అధికారులు
Bhadrachalam ACB Trap: అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) మరోసారి వణుకు పుట్టించింది. భద్రాచలం అటవీశాఖ డివిజనల్ అధికారి (FDO) సుజాతతో పాటు చర్ల ఇన్‌ఛార్జి డీఆర్‌వో కృష్ణయ్య ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న రోడ్డు పనుల కోసం కొన్ని చెట్లను తొలగించారు. ఈ అంశంపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇచ్చుకోవాలని ఎఫ్‌డీవో సుజాత బాధితుడిని డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదుతో పథకం రచించిన ఏసీబీ డీఎస్పీ రమేశ్ బృందం.. గురువారం నిఘా పెట్టింది. భద్రాచలంలో బాధితుడి నుంచి రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎఫ్‌డీవో సుజాతను, ఆమెకు సహకరించిన ఇన్‌ఛార్జి డీఆర్‌వో కృష్ణయ్యను పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు, కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.




