Bhadrachalam: ఏజెన్సీ గ్రామాల్లో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యటన

Bhadrachalam
x

Bhadrachalam: ఏజెన్సీ గ్రామాల్లో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యటన

Highlights

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యటించారు.

Bhadrachalam: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం చర్ల,దుమ్ముగూడెం మండలాల్లోని పలు ఏజెన్సీ గ్రామాల్లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ కమ్యూనిటీ హాళ్ళను ప్రారంభించడం జరిగింది. చర్ల మండలంలోని ఏజెన్సీ గ్రామాలైన కుర్నపల్లి, బత్తినపల్లి, చెన్నాపురం మరియు దుమ్ముగూడెం మండలంలోని చింతగుప్ప, ముల్కనపల్లి ఏజెన్సీ గ్రామాల్లో నివసించే ఆదీవాసీ ప్రజలకు పలు కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన కమ్యూనిటీ హాళ్ళను భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా చర్ల మండలం బట్టిగూడెంలో జరిగిన గ్రామోత్సవ సభలో కూడా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారధ్యంలో ఏజెన్సీ ప్రాంత వాసుల అభివృద్దే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా చర్ల,దుమ్ముగూడెం మండలాల్లోని ప్రతి ఏజెన్సీ గ్రామానికి విద్య,వైద్యం, రవాణా సౌకర్యాలను అందించే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగానే వారికి కమ్యూనిటీ హాళ్ళను అందించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎలాంటి సమస్యలున్న పోలీసు శాఖ దృష్టికి తీసుకువస్తే,సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చర్ల సిఐ రాజువర్మ, దుమ్ముగూడెం సిఐ వెంకటప్పయ్య, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ, సీఆర్పీఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories