Telangana Budget 2026: బడ్జెట్‌పై రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు!
Telangana Budget 2026: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Telangana Budget 2026: బడ్జెట్‌పై రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు!
Telangana Budget 2026: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలను అడియాసలు చేసిందని, ఇదొక "ఫాల్స్, ఫెయిల్డ్, ఫ్యాన్సీ బడ్జెట్" అని ఆయన అభివర్ణించారు.
రామచందర్ రావు చేసిన ప్రధాన విమర్శలు:
"డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పొరపాటున గత ఏడాది బడ్జెట్ చదివారేమోనన్న అనుమానం కలుగుతోంది. గత పద్దుకు దీనికి పెద్దగా తేడా లేదు" అని ఎద్దేవా చేశారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్యకు కేవలం 8 శాతం నిధులు కేటాయించడం బాధాకరమన్నారు. ఆరోగ్యశ్రీకి దిక్కులేదని, పెన్షన్లతో ముడిపెట్టి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.
రీజినల్ రింగ్ రోడ్ (RRR), రీజినల్ రైల్, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులన్నీ కేంద్రానివేనని.. భూసేకరణ తప్ప రాష్ట్రం చేసేదేమీ లేదని స్పష్టం చేశారు. మన్రేగాలో అక్రమాలను అరికట్టేందుకే కేంద్రం రాష్ట్రాలను భాగస్వాములను చేసిందని వివరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐదుసార్లు రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటికీ మూడోసారికి మాత్రమే పరిమితం కావడం మోసం కాదా అని ప్రశ్నించారు.
బడ్జెట్‌లో మైనారిటీలకు నిధులు పెంచిన ప్రభుత్వం, హిందూ దేవాలయాల మరమ్మతులు, అర్చకుల వేతనాలు, ధూప దీప నైవేద్యాల గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఆలయాలపై దాడుల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు.
జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసిన ప్రభుత్వం, బడ్జెట్‌లో హైదరాబాద్‌కు సున్నా కేటాయింపులు ఇచ్చిందని.. నిధులు లేకుండా నగరం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తంగా ఈ బడ్జెట్ సామాన్య ప్రజలను మోసం చేసేలా ఉందని, చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తోందని రామచందర్ రావు విమర్శించారు.




