Rakesh Reddy: అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే ఇవాళే రాజీనామా చేస్తా!

Rakesh Reddy: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 16 Sept 2026 11:42 AM IST
Rakesh Reddy
X

Rakesh Reddy: అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే ఇవాళే రాజీనామా చేస్తా!

Rakesh Reddy: అసెంబ్లీ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా అంటేనే ప్రభుత్వానికి పట్టింపు లేదని, కేవలం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. నిజాం కాలంలో కట్టిన ప్రభుత్వ కార్యాలయాలు కూలిపోయే స్థితికి చేరినప్పటికీ, సీఎం మరియు మంత్రులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోతే ఇవాళే తన పదవికి రాజీనామా చేస్తానని సభలో ప్రకటించారు.

కొడంగల్, పరిగి వంటి కొన్ని ప్రాంతాలకు భారీగా నిధులు ఇస్తున్నారని, కానీ నిజామాబాద్ జిల్లా అభివృద్ధిని మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.

ఆర్మూరులో నిజాం కాలం నాటి ఎంఆర్వో, సబ్ కలెక్టర్ ఆఫీసులు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, క్లర్క్ స్థాయి అధికారి కూర్చోవడానికి కూడా సరైన వసతులు లేవని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు.

చిన్న చిన్న కోరికలు కోరితేనే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోందని, నిజామాబాద్ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈరోజే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.