Telangana: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి బహిరంగ లేఖ!

Telangana: తెలంగాణలో నిధుల లేమితో కొత్త గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మండిపడ్డారు.

G. Govind, Medchal
Published on: 6 Aug 2026 11:26 PM IST
Telangana
X

Telangana: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి బహిరంగ లేఖ!

తెలంగాణ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎమ్మెల్సీ అంజిరెడ్డి గత బీఆర్ఎస్ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేయలేదు. అదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుంది.

ముఖ్యంగా కొత్త గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీ పరిస్థితి ఘోరంగా ఉంది. 2016 నుంచి 2023 మధ్య ఏర్పాటైన 74 కొత్త మున్సిపాలిటీలు సొంత ఆదాయం లేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, కొహిర్, ఇంద్రేశం వంటి మున్సిపాలిటీలు అప్‌గ్రేడ్ అయినా ఇంకా గ్రామీణ లక్షణాలనే కలిగి ఉన్నాయి. అక్కడ ఉపాధి హామీ పనులు ఉండవు.. స్థానికంగా పని ఉండదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా మారింది.

ఇవాళ ఈ విషయంపై సీఎంకు బహిరంగ లేఖ రాస్తున్న. పన్ను వసూళ్లు లేక కనీస పరిపాలనా ఖర్చులు కూడా భరించలేని దుస్థితి నెలకొంది. నిధుల లేమితో పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు, డ్రైవర్లకు జీతాలు అందక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సిబ్బందికి వేతనాలు లేకపోవడం, నిధులు కొరవడటంతో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

కొన్ని గ్రామాలకు కేవలం 300 నుంచి 400 జనాభా ఉండి సొంత ఆదాయం లేని 4,383 కొత్త గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లే ఈ కొత్త పంచాయతీలను సర్పంచ్ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే కనీసం రూ. 10 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయించాలి. దీనితో పాటుగా నూతన మున్సిపాలిటీలను గట్టెక్కించేందుకు ఎస్‌డీఎఫ్ (SDF) మరియు ప్రత్యేక గ్రాంట్ల ద్వారా రూ. 50 లక్ష ల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించాలి.

కొత్తగా ఏర్పాటు చేసిన మునిసిపల్ కార్పొరేషన్ లో కూడా సిబ్బంది లేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఇచ్చే సీడీఎఫ్ నిధులు కాంగ్రెస్ సర్కార్ ఇవ్వడం లేదు. ప్రజాప్రతినిధులకు నిధులు ఇవ్వకుండా ఇలా కాలయాపన చేయడం కరెక్ట్ కాదు.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story