Armoor: ఆర్మూర్ ఆర్‌డీవో ఆఫీస్ ముట్టడి: రేవంత్ సర్కార్‌పై బీజేపీ గర్జన!

Armoor: ఆర్మూర్ లో ఆరు గ్యారంటీల అమలు కోసం బీజేపీ నిరసన. ఎర్రజొన్నకు క్వింటాల్ కు 4500 మద్దతు ధర, 500 బోనస్ ఇవ్వాలని పట్టణ అధ్యక్షుడు మందల బాలు డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 March 2026 5:06 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ లో ఎగిసిన నిరసన సెగ: ఆరు గ్యారంటీలపై బీజేపీ ధ్వజం.. ఆర్డీవోకు వినతిపత్రం అందజేత!

ఆర్మూర్: పట్టణంలోని భారతీయ జనతా పార్టీ పట్టణ టౌన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో నిరసన సెగ, నిర్వహిస్తూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, వి వాంట్ జస్టిస్ , అంటూ నినాదాలు చేస్తూ ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మందల బాలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలంటూ, కానీ ఇప్పటికీ ఎలాంటి హామీ ప్రజలకు నెరవేరులే అన్నారు , ముఖ్యంగా పేదలకు గృహ నిర్మాణం పథకం, యువతకు జాబ్ క్యాలెండర్, రైతులకు రైతు భరోసా, భూ సమస్యలకు, పరిష్కారానికి ఇప్పటికీ అమలు కాలేదు , ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీని, మాకు ఎలాంటి మేలు జరగలేదు అంటున్న ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు,

రైతులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన హామీలను మేరకు రైతు భరోసా ఆ సమయానికి అందకపోవడంతో రైతులు పెట్టుబడులు కోసం అప్పుల పై ఆధారపడాల్సిందే.

రైతులకు పూర్తిగా ఫసల్ బీమా అమలు చేస్తానన్నా విషయం చేయనందున మొన్న ఇటు వలే కురిసిన అకాల వర్షానికి రైతులకు చాలా నష్టం జరిగింది, వర్షం కురిసినందున రోడ్లపై ఎర్రజోన్నని ఆర పోసి నాచర్ వచ్చిన కానీ ఇప్పటిది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, రైతులను పట్టించుకుంటలేరు అంటూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నోరు తెరిచి ఎర్రజొన్నకు క్వింటాల్ కు 4500 రూపాలు 500 బోనస్ ఇవ్వాలంటూ, ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేయాలంటూ భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ లేని అందును జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story