Medak: మెదక్‌లో బీఆర్ఎస్ నేత కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బర్త్‌డే హడావుడి.. చర్చి, గుడి, ఈద్గాల్లో ప్రార్థనలు!

Medak: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి.

NAGARAJ, MEDAK
Published on: 10 Jun 2026 3:59 PM IST
Medak
X

Medak: మెదక్‌లో బీఆర్ఎస్ నేత కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బర్త్‌డే హడావుడి.. చర్చి, గుడి, ఈద్గాల్లో ప్రార్థనలు!

మెదక్: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు, మరింత ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆరోగ్యంగా, ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. నవపేటలోని ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలు సామరస్యానికి, సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచాయని నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీ అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారని అన్నారు. ఆయన సేవలు మరింత విస్తరించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కంఠారెడ్డి తిరుపతి రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి నాయకులు మాణిక్య రెడ్డి చంద్రశేఖర్ గౌడ్ జైపాల్ రెడ్డి నవీన్ మాజీ ఏడుపాయల కమిటీ చైర్మన్ బాల గౌడ్. మాజీ కౌన్సిలర్ వంజరి రాజు. మాయ మల్లేష్. తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో సుమారు 200 మంది రక్తదానం చేయడం జరిగింది.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story