Bodhan: దళారులపై ఉక్కుపాదం.. ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరిక!
Bodhan: బోధన్ డివిజన్లో వరి కోతలు ప్రారంభమైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారు.
Bodhan: దళారులపై ఉక్కుపాదం.. ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరిక!
Bodhan: బోధన్ డివిజన్ పరిధిలో వరి కోతల ప్రారంభమైనప్పటికీ పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. పండించిన ఉత్పత్తులను సకాలంలో విక్రయిద్దాం అంటే కష్టాలు తప్పడం లేదు. ధాన్యం దళారులు తక్కువ ధరకు వరిని కొనుగోలు చేసి రైతులను నిలువుగా ముంచుతున్నారు. క్వింటాకు రూ.1950 దళారు చెల్లించి తేమ పేరుతో మూడు కిలోల తరుగును అదనంగా దోచుకుంటూ రైతులను ముంచుతున్నారు.
సకాలంలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దలార్ల పాలు చేయక తప్పడం లేదు. మిక్రయాలు చివరిదశకు చేరుకోగానే ఆదరాబాదరగా కొనుగోలు కేంద్రాలను తెరుస్తున్నారు. మరోవైపు వ్యాపారస్తులు సిండికేట్ గా మారి హమాలీ క్యాష్ కటింగ్ పేరుతో రైతులను దోచుకుంటున్నారు.
బోధన్ డివిజన్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది. అలా జరగకపోవడంతో నల్గొండ, మిర్యాలగూడ, మహారాష్ట్ర వ్యాపారులు వచ్చి ధాన్యాన్ని తీసుకెళ్తున్నారు. గతేడ అది బోధన్ డివిజన్ పరిధిలో కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యాపారి వచ్చి సుమారు 250 మంది రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 5 కోట్లకు ఎగనాం వేసి వెళ్ళిపోయాడు.
ఇంతవరకు వ్యాపారి రైతుకు ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. రైతులు బోధన్ వర్ని పోలీస్ స్టేషన్లో వ్యాపారిపై కేసులు పెట్టినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం ముందుగాకొనుగోలు కేంద్రాలు తెరిచినట్లయితే ఇలాంటి పునారవృతం కాకుండా ఉంటుందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిన్న ముంచుతున్న దళారులు లైసెన్సులు లేని దళారుల చలామణి జిఎస్టి టాక్స్ ఎగవేత: నిబంధనల ప్రకారం దళారులు వ్యవసాయ మార్కెట్ కమిటీలు కచ్చితంగా లైసెన్సులు తీసుకోవాలి. 5000 పైబడి చెల్లింపులు చేసినట్లయితే సదరు దళారి జీఎస్టీ చెల్లించి ప్రభుత్వానికి టాక్స్ కట్టాల్సి ఉంటుంది. బోధన్ డివిజన్ రుద్రూర్ మండల కేంద్రంలో ఓదలారి ఏకంగా రైతులను మోసం చేస్తూ రైతులు డబ్బులు సైతం సంతానికి వాడుకుంటూ అనేకమార్లు రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించలేదు.
వాస్తవానికి సదరు దళారి నిరక్షరాశులు అయినప్పటికీ రైతులను మభ్యపెడుతూ క్యాష్ కటింగ్ పేరుతో భారీ స్థాయిలో డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తన వెనకాల ఒక ప్రజాప్రతిని ఉన్నాడంటూ రైతులను మోసగించడంతోపాటు మార్కెట్ కామ పోలీస్ శాఖ అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నాడు. దళారులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసినట్లయితే ప్రభుత్వ ఆదాయానికి మేలు చేకూరుతుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ఏకకాలంలో చెల్లించాల్సిన డబ్బులు రుద్రూర్ చెందిన దళారి తన స్వప్రయోజనాలకు రైతుల డబ్బులను వినియోగించుకుంటూ ఏడాది కాలం పాటు డబ్బులు చెల్లించడంలో వేధింపుల కు గురి చేసినట్లు చేసినట్లు అనేక మంది బాధ్యత రైతులు గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు ఇలాంటి దళారులపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకున్నట్లయితే రైతుల మోసపోయే అవకాశం ఉండదు.
నిబంధన ప్రకారం లైసెన్స్ పొందిన దళారి వద్ద డబ్బులు రైతులకు సులువుగా వస్తాయి. ఇలాంటి దళారుల వద్ద నుండి డబ్బులు తీసుకోవడం గగనమే అనిపిస్తుంది.
లైసెన్స్ లేని దళారులపై చర్యలు తీసుకుంటాం, బోధన్ ఎసిపి శ్రీనివాస్
రైతులు దళారుల ఆశ్రయించి మోసపోవద్దని లైసెన్స్ లు ఉన్న దళారులకు మాత్రం ధాన్యం విక్రాయించాలి. లైసెన్స్ లేని దళారులను గుర్తించి చర్యలు తీసుకుంటాం.




