Bodhan: ఎకరాకు 60 బస్తాల వరి దిగుబడి.. బోధన్ రైతుల రికార్డు!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ రైతులు వరి సాగులో రికార్డు సృష్టించారు. ఎకరాకు 60 బస్తాల దిగుబడి సాధించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు.
Bodhan: ఎకరాకు 60 బస్తాల వరి దిగుబడి.. బోధన్ రైతుల రికార్డు!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో వరి కోతలు ప్రారంభమై 20 రోజులు కావస్తున్నప్పటికీ అధిక దిగుబడులు పండించడంలో బోధన్ డివిజన్ రైతులకు ప్రత్యేక గుర్తింపు మరోసారి లభించింది. డివిజన్లోని రుద్రూర్, వర్ని, కోటగిరి ప్రాంతాల్లోని రైతులు ఎకరాకు 55 నుండి 60 బస్తాల చొప్పున సాధించి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శ రైతుల నిలిచారని చెప్పవచ్చు.
వ్యయ ప్రయాసలు కూల్చుకొని ఇటీవల ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు. మరి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసినప్పటికీ దిగుబడి మాత్రం ఆశాజనకంగా వచ్చింది. రుద్రూర్ తదితర ప్రాంతాల్లోని రైతులు పూర్తిగా కవులు పొలాలపై ఆధారపడి ఉన్నారు. గత వర్షాకాలంలో భారీగా కౌలు రైతులకు నష్టాలు వచ్చినప్పటికీ వేసంగిలో ఆశించిన దానికంటే అధికంగా దిగుబడులు వచ్చాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గిట్టుబాటు లేక దళారుల పాలు వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు గిట్టుబాటు లేక పోయినప్పటికీ దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. పండించిన పంట ఎక్కడ నేలపాలవుతుందో నాన్న భయంతో క్వింటా ధాన్యం 1850 చొప్పున దళారుల పాలు చేయాల్సిన పరిస్థితి ఉందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాకర్ దేశాయ్ ఎకరాకు 56 బస్తాలు 45 ఎకరాలు కౌలు కు చేస్తా కౌలు రైతు: తాను 45 ఎకరాల వ్యవసాయం చేస్తున్నానని సొంత భూమి ఐదు ఎకరాలు ఉన్నప్పటికీ మిగతా భూమిని కౌలుకు తీసుకొని వారి పంటను పండిస్తున్నానని పేర్కొన్నారు. గత వర్షాకాలంలో రూపాయల 10 లక్షల నష్టం వాటిల్లినప్పటికీ ప్రస్తుతం ఎకరాకు 56 బస్తాలు చొప్పున దిగుబడి వచ్చిందని రైతు సంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల సకాలంలో ఏర్పాటు చేసి ఉంటే తమకు గిట్టుబాటు ధర లభించేదని దిక్కుతోచని పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు అప్పగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అడప సాయి రెడ్డి ఎనిమిది ఎకరాలు కౌలు చేస్తున్నాను ఎకరాకు 59 బస్తాలు దిగుబడి వచ్చింది తాను ఎనిమిది ఎకరాలు భూమిని సాగు చేస్తున్నానని ప్రస్తుతం వచ్చిన దిగుబడిలో ఎకరాకు 59 బస్తాలు వచ్చినట్లు ఆదర్శ రైతు పేర్కొన్నారు. ప్రభుత్వం ముందుచూపుతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లయితే రైతులకు గిట్టుబాటు ధర లభించేది.




