Bodhan: ప్రాణాలు కాపాడుకుందాం.. నిబంధనలు పాటిద్దాం

Bodhan: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 April 2026 3:17 PM IST
Bodhan
X

Bodhan: ప్రాణాలు కాపాడుకుందాం.. నిబంధనలు పాటిద్దాం

Bodhan: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఎమ్మెల్యే సుదర్శన్ డి పేర్కొన్నారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ స్థానం కల్పించిందని అంబేద్కర్ ఆశయ సాధనలోని కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందన్నారు.

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని ప్రభుత్వ సలహా గారు సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా 99 రోజుల ప్రజాపాలనలో పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని,

కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు నియమాలు పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లో భాగంగా పోలీస్ శాఖ ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని ప్రతి ఒక్కరు పోలీసుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధనీసిపి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, పట్టణ సీఐ వెంకటనారాయణ, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story