Uppal Metro Station: హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో బాంబు కలకలం!
Uppal Metro Station: భాగ్యనగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ వచ్చిన ఒక ఫోన్ కాల్ ఒక్కసారిగా కలకలం రేపింది.
Metro Station
Uppal Metro Station: భాగ్యనగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ వచ్చిన ఒక ఫోన్ కాల్ ఒక్కసారిగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఈ బెదిరింపుతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
మెట్రో సిబ్బందికి అజ్ఞాత వ్యక్తి ఫోన్
హైదరాబాద్ నగరం లో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉప్పల్ ఒకటి. ఉప్పల్ మెట్రో స్టేషన్ సిబ్బందికి ఒక అపరిచిత వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. స్టేషన్ ఆవరణలో బాంబు పెట్టామని అని ఆ వ్యక్తి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు , స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి బాంబ్ , డాగ్ స్క్వాడ్
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా స్టేషన్ లోపల ఉన్న ప్రయాణికులను ఖాళీ చేయించి, పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్ బృందాలు మెట్రో స్టేషన్ లోని ప్రతి మూలను, అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.
అంతా ఊపిరి పీల్చుకున్నారు…
సుదీర్ఘ తనిఖీల అనంతరం స్టేషన్ లో ఎక్కడా ఎలాంటి బాంబులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు నిర్ధారించారు. దీంతో అది ఒక 'ఫేక్ కాల్' (తప్పుడు సమాచారం) అని తేలిపోయింది. ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు ప్రకటించడంతో మెట్రో సిబ్బంది , ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
నిందితుడి కోసం గాలింపు
ఈ ఆకతాయి చేష్టపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఫోన్ కాల్ వచ్చిన నంబర్ ఆధారంగా నిందితుడు ఎక్కడి నుండి మాట్లాడాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




