KCR: ముద్రగడ పద్మనాభం మృతి పట్ల కేసీఆర్ తీవ్ర సంతాపం!

KCR: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 July 2026 10:52 PM IST
KCR
X

KCR: ముద్రగడ పద్మనాభం మృతి పట్ల కేసీఆర్ తీవ్ర సంతాపం!

KCR: నమ్మిన సిద్దాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన నేత ముద్రగడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన,మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, కాపు ఉద్యమ నేత. ముద్రగడ పద్మనాభం మరణం పట్ల, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు గారు సంతాపం ప్రకటించారు.

పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పనిచేసిన ముద్రగడ గొప్ప ప్రజా నాయకుడని, ముఖ్యంగా కాపు వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన కృషి గొప్పదని అన్నారు.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపులు, అనుబంధ కులాలకు అందించాలనే తపనతో, తాను నమ్మిన సిద్దాంతం కోసం జీవితకాలం రాజీలేని పోరాటం చేసిన ప్రత్యామ్న్యాయ రాజకీయ వేత్త అని కేసీఆర్ కొనియాడారు.

వారి మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.శోకతప్తులైన కుటుంబ సభ్యులకు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story